తీరొక్క పూలు.. సంప్రదాయ నృత్యాలు


Thu,October 11, 2018 12:26 AM

భైంసారూరల్ : మండలంలోని కామోల్ గ్రామంతో పాటు పట్టణంలోని గురుకృప వొకేషనల్ కళాశాలలో బుధవారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు పూలతో బతుకమ్మలను పేర్చి పూజలు చేసి ఆట, పాటలతో ఆనందించారు. అనంతరం సమీపంలోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ప్రసన్నరాణి, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఘనంగా బతుకమ్మ సంబురం
కుంటాల : మండలంలోని లింబా (బీ)లో బుధవారం బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజల అనంతరం ఆట పాటలతో ఊరేగించి చెరువులో నిమజ్జనం చేశారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...