శోభాయమానం


Mon,September 24, 2018 03:51 AM

నిర్మల్‌కల్చరల్/టౌన్: జిల్లాలో ఆదివారం గణనాథుడి నిమజ్జనోత్సవంలో భాగంగా శోభాయాత్ర అంగంరంగ వైభవంగా జరిగింది. నిర్మల్‌లతోపాటు ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో నిమజ్జనోత్సవం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన శోభాయాత్రలో రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. బుధవార్‌పేట్‌లో గణేష్‌శ్ ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో నంబర్ వన్ గణనాథుని వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంస్కృతీ సంప్రదాయాలు తెలిపేవే పండుగలన్నారు. అందులో వినాయక చవితికి అత్యధిక ప్రాధాన్యత ఉందన్నారు. గణేశ్ నిమజ్జన శోభాయాత్రను అన్ని మండపాల నిర్వాహకులు భక్తి వాతావరణంలో శాంతి యుతంగా జరుపుకోవాలన్నారు.

ఈ సంవత్సరం బాగా వర్షాలు కురిసినందునా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటూ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆ గణనాథున్ని వేడుకున్న ట్లు తెలిపారు. ఎస్పీ శశిధర్‌రాజు మాట్లాడుతూ గణేశ్ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకొని పోలీసు వారికి సహకారం అందించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి మాట్లాడుతూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పులిహోరా, వాటర్ ప్యాకెట్లను అందించినట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, ఎస్పీ శశిధర్‌రాజు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి నృత్యాలు చేస్తూ గణేశ్ శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రత్ ఈశ్వర్, సభ్యులు, గండ్రత్ రమేశ్, పతికెరాజేందర్, దోనగిరి మురళి, నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మారుగొండరాము, పాకాల రాంచందర్, డి. శ్రీనివాస్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...