ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహనా ర్యాలీ


Mon,September 24, 2018 03:48 AM

సోన్: 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు నమోదు చేసుకోవాలని నిర్మల్ మండలంలోని కొండాపూర్‌లో డ్వాక్రా సంఘాల మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లకార్డులతో ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ జనవరి ఒకటి 2018 నాటికి 18 సంవత్సరాలు నిండినట్లయితే స్థానిక బీఎల్‌వోల వద్ద పేరు నమోదు చేసుకోవచ్చన్నారు. ఓటరు లిస్టులో పేరు లేనివారు సరిచూసుకుని నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశం ఈ నెల 25 తేదీ వరకు మాత్రమే ఉందన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. స్వచ్ఛత సేవా కార్యక్రమంలో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాయకులు మేకల నర్సయ్య, గ్రామ కార్యదర్శి టి.లక్ష్మణ్, ఏపీఎంలు నర్సయ్య, నారాయణరెడ్డి, మాధురి, అర్జాబాయి, సీసీలు రేఖ, నర్సయ్య, జ్యోతిర్మయి, వీఏవోలు పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...