క్రిమి సంహారక మందు తాగి బలవన్మరణం


Sun,September 23, 2018 02:51 AM

దస్తురాబాద్ (కడెం) : మండలంలోని గొడిసెర్యాల గ్రామానికి చెందిన సాకలి నరేశ్ (26) అనే వ్యక్తి క్రిమి సంహారక మందుతాగి అత్మహత్య చేసుకున్నాడు. దస్తురాబాద్ ఏఎస్సై ఆర్.భీం రావు తెలిపిన వివరాల ప్ర కారం.. గొడిసెర్యాల గ్రామానికి చెందిన సాకలి నరేశ్‌కు ఇదే మండలంలోని రేవోజిపేట గ్రామానికి చెందిన యువతితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజులుగా కుటుంబంలో కలహాలు రావడంతో నరేశ్ దంపతులు విడాకులు తీసుకొన్నారు. నాలుగు నెలల క్రితం విడాకులు తీసుకున్న నరేశ్ అప్పటి నుంచి మానసికంగా ఆవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో క్రిమి సంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుం చి మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌కు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్సై తెలిపారు. నరేశ్ దంపతులకు ఇక కూతురు ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ఆర్.భీంరావు వెల్లడించారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...