చేనేత కార్మికులకు చేయూతనిద్దాం


Sun,September 23, 2018 02:51 AM

నిర్మల్‌టౌన్ : చేనేత కార్మికులకు చేయూతను అందించేందుకు తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా కృషి చేసిందని రాష్ట్ర మంత్రి ఐకేరెడ్డి అన్నారు. పట్టణంలోని స్థానిక ఎంఎస్ ఫంక్షన్‌హాల్‌లో శ్రీ కళాభారతి చేనేత హస్త మేళా వస్త్ర ప్రదర్శనను జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేనేత కార్మికులు తయారు చేస్తున్న దుస్తువుల అమ్మకాలను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వారు తయారు చేసిన వస్తువులను ప్రజలు వినియోగించుకున్నప్పుడే వారికి ఆర్థిక భరోసా కల్పించినవారమవుతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజి రాజేందర్, స్థానిక కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్, నిర్వాహకులు ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...