డబుల్‌ను పరుగులు పెట్టిస్తాం


Fri,September 21, 2018 10:50 PM

నిర్మల్, నమస్తే తెలంగాణ: డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఇంజినీరింగ్, ఐఐటీ సంస్థల సాంకేతిక నిపుణుల సలహాలతో సత్వరంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్‌లో కొనసాగుతున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను మంత్రి అల్లోల పరిశీలించారు. కొనసాగుతున్న పనులపై మంత్రి సంతృప్తి చెందారు. ఎల్లపెల్లి గ్రామంలో 45 ఇండ్ల నిర్మాణం పూర్తికాగా ఇప్పటికే అర్హులకు అందజేస్తామన్నారు. మళ్లీ ఎల్లపెల్లి తో పాటు రత్నాపూర్‌కాండ్లీ, చిట్యాల్ గ్రామంలో కొత్త ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే దశకు చేరుకున్నాయన్నారు. బంగల్‌పేట్‌లో జీప్లస్ 3 విధానంలో కొనసాగుతున్న ఇండ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అన్ని గ్రామాల్లో స్థలాల ఎంపికను దాదాపుగా పూర్తి చేసిందని త్వరలోనే అన్నిచోట్ల కొత్త ఇండ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు. అర్హులైన వారి సొంతింటి కలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

స్థలాల సేకరణ కూడా ప్రభుత్వ నిధులతోనే చేపట్టి ఆ తర్వాత సుమారు ఒక్కో ఇంటికి రూ.6లక్షలు వెచ్చించి డబుల్‌బెడ్‌రూం ఇంటిని నిర్మించి ఇవ్వడం సామాన్యమైన విషయం కాదన్నారు. అత్యంత ఖరీదైన పథకం అయినప్పటికీ సీఎం కేసీఆర్ వెనక్కి తగ్గకుండా కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తి చేసేందుకు ముందుకు సాగుతున్నారన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేందర్, టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, కౌన్సిలర్లు చంద్రకళ, అంగ నరేశ్, ఎలుగు సుధాకర్, నాయకులు పాతర్ల గణేశ్, తోట సురేందర్, అధికారులు ఉన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...