కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు యాక్షన్‌ప్లాన్ రూపొందించాలి


Fri,September 21, 2018 01:42 AM

నిర్మల్‌టౌన్: జిల్లాకేంద్రంలో వరి, మక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను రూపొందిచాలని జేసీ ఎ.భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులతో ధ్యానం కొనుగోళ్ల ఏర్పాటు, మార్కెట్ సౌకర్యం, రైస్‌మిల్లర్లకు ధాన్యం తరలింపు తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో రైతులు సాగు చేసిన మొక్క జొన్న, వరి అక్టోబర్, నవంబర్‌లో మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ఐకేపీ, సహకార సంఘం, మార్కెఫెడ్ ద్వారా 125 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మార్కెఫెడ్ ద్వారా 60 మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మార్కెట్ కమిటీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యా న్ని వెంటది వెంటనే గోదాంలకు తరలించాలన్నారు. దసరాకు పత్తి కొనుగోళ్లు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంతో పాటు ఆయా మండలాల్లో సామర్థ్యం ఉన్న గోదాములను గుర్తించాలని ఆదేశించారు. అన్ని శాఖాధికారులు సమన్వయంతో ఈకార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ అధికారి కోటేశ్వర్‌రావు, డీఎస్‌వో కిరణ్‌కుమార్, సహకార సంఘం జిల్లా అధికారి సూర్యచందర్‌రావు, ఏపీడీ గోపాల్‌రావు పాల్గొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...