ఓటు హక్కుపై విస్తృత ప్రచారం చేయాలి


Wed,September 19, 2018 11:18 PM

నిర్మల్ టౌన్: జిల్లాలో 18 సంవత్సరాలు నిం డిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని, ఇందుకు అన్నిశాఖల అధికారులు విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఓటు నమోదు కార్యక్రమం మార్పు లు, చేర్పుల సూచనల కోసం సహాయ కేంద్రాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 10 నుంచి 25 వరకు నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు నమోదుకు నిర్మల్, భైంసా పట్టణాలతో పాటు అన్ని మండలాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. బీఎల్‌వోలు ఓటు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. అర్హులైన ఓటర్లను గుర్తించి ఫాం నెంబరు 6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవడం, 7 ఫాం ద్వారా చనిపోయిన ఓటర్లను తొలగించడం, 8 (ఎ) ద్వారా పోలింగ్ బూత్‌ల మార్పిడి చేపడుతున్నామని వివరించారు. గతంలో గల్లంతైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఓటు నమోదుపై విస్తృత ప్రచారం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ భాస్కర్‌రావు, ఆర్డీవో ప్రసూనాంబ, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...