ప్రియురాలి కాపురం కూల్చిన మాజీ ప్రియుడు


Wed,September 19, 2018 11:17 PM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: ప్రియురాలి భర్తకు అసభ్యకరమైన మెసేజ్‌లు, ఫొటోలు పెట్టి ఓ కాపురాన్ని కూల్చేశాడు ఓ మాజీ ప్రేమికుడు. దీంతో ఆ యువతికి భర్త విడాకులు ఇచ్చారు. ఈ విషయమై యువతి పట్టణంలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మాజీ ప్రేమికుడిపై నిర్భయ, సెక్షన్ 354 కేసులు నమోదు చేశారు. వన్‌టౌన్ సీఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. భీంపూర్ మండలం నిపానీకి చెందిన ఓ యువతికి జిల్లా కేంద్రంలోని నానాపటేల్ కళాశాల వద్ద ఉన్న ఓ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్న పట్టణానికి చెందిన వర్ష అమరేందర్‌తో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యవతిని మోసం చేశాడు. ఇద్దరూ విడిపోయిన తర్వాత యువతి ఇచ్చోడకు చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంది. అమరేందర్ కొంతకాలంగా యువతిని వేధిస్తున్నాడు. ఆదిలాబాద్ వచ్చి తనను కలవాలని లేదంటే తన భర్తకు ఫొటోలు పంపుతానని బెదిరించేవాడు. యువతి నిరాకరించడంతో అమరేందర్ అసభ్యకరమైన మేసేజ్‌లు, గతంలో వారిద్దరూ దిగిన ఫొటోలను యువతి భర్తకు వాట్సాప్‌లో పంపించాడు. దీంతో భార్యా భర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. భర్త విడాకులు ఇవ్వడంతో ఆ యువతి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...