గోమయ వినాయక విగ్రహాలతో పర్యావరణ సమతుల్యం


Thu,September 13, 2018 12:42 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ : పర్యావరణ సమతుల్యత కోసమే గోమయ వినాయక విగ్రహాలను అందుబాటులోకి తెచ్చి నిర్మల్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి పంపిణీ చేయాలని నిర్ణయించామని మంత్రి అల్లోల తనయుడు, అల్లోల ట్రస్టు కన్వీనర్ గౌతంరెడ్డి, క్లిమోమ్ గోశాల చైర్‌పర్సన్ అల్లోల దివ్యరెడ్డి అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన పూరిత రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలతో పర్యావరణ ముప్పుతో పాటు నీటి వనరులు తీవ్రంగా కలుషితమై ప్రజలకు హాని కలుగుతుందని అన్నారు. అందుకే జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది జాతీయ అవార్డును పొందిన క్లిమోమ్ గోశాల ఆధ్వర్యంలో హైదరాబాద్ సమీపంలో భారీగా గోమయ వినాయక విగ్రహాలను తయారు చేయించామని చెప్పారు. అనేక వ్యయప్రయాసలకోర్చి నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వినాయక విగ్రహాలను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో పది అడుగులు... మండల కేంద్రాల్లో ఆరు అడుగులు, అన్ని గ్రామాల్లో మూడు అడుగుల ఎత్తుతో కూడిన గోమయ విగ్రహాలను తయారు చేయించామన్నారు. సుమారు 250కి పైగా గోమయ వినాయక విగ్రహాలు అన్ని గ్రామాల వినాయక ఉత్సవ కమిటీలకు అందజేయనున్నట్లు తెలిపారు. బుధవారం మంత్రి అల్లోల నివాసం వద్ద విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఉత్సవ కమిటీలు, భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలకు గోమయ వినాయక విగ్రహాలను అల్లోల ట్రస్టు, క్లిమోమ్ సంస్థ సంయుక్తంగా అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి పాకాల రాంచందర్, సోన్, నిర్మల్ మండలాల అధ్యక్షుడు మోహినొద్దీన్, ముత్యంరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జీవన్‌రెడ్డి, నాలం శ్రీనివాస్, ద్యాగ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...