సరుకులు పక్కాగా పంపిణీ చేయాలి


Wed,September 12, 2018 01:53 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ: పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక వైఎస్సార్ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా పౌర సరఫరాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చౌకధరల దుకాణాల డీలర్లకు కమీషన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రేషన్ షాపు డీలర్ల కమీషన్ కిలోకు 70పైసలు క్వింటాలు రూ. 70 పెంచినట్లు తెలిపారు. గతంలో కుటుంబానికి 20 కిలోల కన్నా ఎక్కువ బియ్యం ఇచ్చే ప్రసక్తే లేకుండేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు కుటుంబంలో ఎంత మంది ఉంటే అన్ని కిలోల బియ్యం ఇస్తున్నట్లు చెప్పారు. పేదలకు రెండు పూటల తిండి పెట్టడమే లక్ష్యంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన పేదలందరికీ తెల్లరేషన్‌కార్డులు జారీ చేశామన్నారు.

డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రేషన్ డీలర్లు లబ్ధిదారులతో సత్సబంధాలు కలిగిఉండాలని సూచించారు. ఈ సందర్భంగా 390 మంది రేషన్ డీలర్లకు రూ. 3కోట్ల 21లక్షల 98వేల326 విలువ గల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడంతో పాటు అక్టోబర్ 2015 నుంచి ఆగస్టు 2018 వరకు రావాలసిన కమిషన్ బకాయిలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రేషన్ డీలర్లు నిత్యావసర సరుకులను సకాలంలో లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి పాల్గొన్నారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...