కాల్వ కదిలి ఆలయాల హుండీ లెక్కింపు


Wed,September 12, 2018 01:52 AM

దిలావర్‌పూర్: మండంలోని శ్రీకాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కదిలి పాపహరేశ్వర ఆలయ హుండీని మంగళవారం లెక్కించారు. కాల్వ ఆలయ హుండీ ఆదాయం రూ. 3లక్షల 76వేల 725, కదలి పాపహరేశ్వర ఆలయ హుండీ ఆదాయం రూ. 3లక్షల 80 వేల471 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో టి. నారాయణ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో కదిలి ఆలయ చైర్మన్ సంబాజీపటేల్,ఆలయ డివిజనల్ ఇన్‌స్పెక్టర్ రంగు రవికిషన్‌గౌడ్, ఆలయ సిబ్బంది కేశవులు, మాధవరావు, పండితులు శ్రీనివాస్, రాము, వెంటేశ్వర్, స్థానిక భక్తులు చిన్నయ్య, మహేశ్, లోలం రాజు, ఆలయ ధర్మకర్తలు భూమేశ్‌యాదవ్ పాల్గొన్నారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...