విద్యుత్ కనెక్షన్‌కు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి


Wed,September 12, 2018 01:52 AM

-జిల్లా విద్యుత్‌శాఖ డీఈ మధుసూదన్
నిర్మల్‌టౌన్: గణేశ్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా మండపాలకు వినియోగించే విద్యుత్‌కు అనుమతి తీసుకోవాలని జిల్లా విద్యుత్ శాఖ డీఈ మధుసూదన్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 11 రోజుల పాటు నిర్వహించనున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విద్యుత్‌ను వినియోగించే వారు విద్యుత్ శాఖ కార్యాలయంలో కనెక్షన్ కోసం దరఖాస్తుచేసుకుంటే వెంటనే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇందుకోసం శాఖ కార్యాలయంలో ప్రత్యేకకౌంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఒక కిలో వాట్స్‌కు రూ. 1406, 1 నుంచి 1.5 కేవీ వరకు రూ. 2085, 2కేవీ వరకు 2745 చెల్లిస్తే అనుమతి పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో విద్యుత్‌శాఖ మెరుగైన విద్యుత్‌ను అందిచేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. మండపాల నిర్వాహకులు విద్యుత్ అధికారుల సూచనలు పాటించి నష్టం జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...