అటవీ అమరుల త్యాగం మరువలేనిది


Wed,September 12, 2018 01:52 AM

నిర్మల్ క్రైం : అటవీ అమరుల త్యాగం మరువలేనిదని జిల్లా అటవీశాఖ అధికారి దామోదర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. అటవీ ఉద్యోగులపై స్మగ్లర్లు దాడులకు పాల్పడడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అడవుల సంరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఎఫ్‌ఆర్‌వో హిదాయత్ అలీ, ఎఫ్‌ఎస్‌వో హర్షద్ రాజా, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...