సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి


Wed,September 12, 2018 01:52 AM

నిర్మల్ టౌన్: జిల్లా షెడ్యుల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ లేకుండా సబ్సిడీ రుణాల కోసం అర్హులైన అభ్య ర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఎస్సీ కార్పొ రేషన్ ఈడీ మాణిక్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. భూమి కొనుగోలు పథకంతో పాటు మైనర్ ఇరిగేషన్ ఎస్సీ నిరుద్యోగ యువతకు శిక్షణ ఉపాధి అవకాశాలు,ఇతర పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. లక్షలోపు రుణం పొంది న వారికి లబ్ధిదారుల వాటా కింద రూ.20వేలు చెల్లిస్తే సబ్సిడీ 80శాతం ఉంటుందన్నారు. రూ.2 లక్షల రుణం పొందే వారికి 70శాతం సబ్సిడీ, రూ. 12లక్షల సబ్సిడీ పొందే వారికి 60శాతం సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. అర్హులైనవారు వెంటనే ప్రభుత్వం గుర్తించబడిన వెబ్‌సైట్‌లో అక్టోబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరా రు. ఇతర వివరాలకు 98488 90116 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...