కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోండి


Wed,September 12, 2018 01:52 AM

కడెం : గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో జలపతినాయక్ సూచించారు. మంగళవారం మండలంలోని కల్లెడ గ్రామంలో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం స్థానికులను వైద్యసేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు. కంటి సమస్యలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులతో పాటు ఆపరేషన్లు చేస్తారన్నారు. ఆయన వెంట గ్రామ ప్రత్యేకాధికారి గడ్డం శ్రీనివాస్, మెడికల్ క్యాంపు అధికారి డాక్టర్ నాగరాజు, మాజీ సర్పంచ్ డాకూరి లక్ష్మి, ఆప్తాలిక్ అసిస్టెంట్ శైలజ, సిబ్బంది మల్లేశం, భూమేశ్, ఏఎన్‌ఎంలు అరుణ, సరిత, ఈజీఎస్ క్షేత్రసహాయకుడు అంజన్నగౌడ్, అంగన్‌వాడీ టీచర్లు భాగ్యలక్ష్మి, ఆశవర్కర్లు అనసూయ, లక్ష్మి, వనజ, విజయ, నాయకులు వెంకటేశ్, నర్సయ్య, సంజీవ్‌పటేల్ ఉన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...