టీఆర్‌ఎస్ జోరు ప్రతిపక్షాల బేజారు


Tue,September 11, 2018 01:02 AM

-దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు
-అభివృద్ధిని మరోసారి ఆదరించండి
-అజ్మీరా రేఖానాయక్
-దస్తురాబాద్ మండలంలో పర్యటన
-ద్విచక్ర వాహన ర్యాలీ, మహిళల ఘన స్వాగతం
ఖానాపూర్/ముథోల్ :టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోజూ గ్రామాలు చుడుతూ, కుల సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. సీఎం కేసీఆర్ అందరి కంటే ముందుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించడం, ఇందులో అందరూ సిట్టింగులే ఉండడంతో జిల్లాలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి రేఖానాయక్‌తోపాటు ముథోల్ అభ్యర్థి విఠల్‌రెడ్డి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. చేసిన అభివృద్ధి వివరిస్తూ.. తమను మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని చెబుతూ ముందుకు సాగుతున్నారు.

నియోజకవర్గంలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం నాలుగేళ్లలోనే చేయగలిగామని, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంతా ప్రజల కళ్లముందు ఉందని, అభివృద్ధిని మరోసారి ఆదరించాలని ఖానాపూర్ టీఆర్‌ఎస్ శాసన సభ అభ్యర్థి రేఖానాయక్ అన్నారు. సోమవారం దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం, దస్తురాబాద్, భూత్కూర్, మున్యాల్, గొడిసెర్యాల, రేవోజిపేట, బుట్టాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నాయకులు భారీ ర్యాలీని నిర్వహించారు. ముందుగా దేవునిగూడెం గ్రామంలో ప్రారంభమైన రేఖానాయక్ పర్యటనకు బుట్టాపూర్‌లో ముగిసింది. ఉదయం దేవునిగూడెం గ్రామానికి చేరుకోగానే మహిళలంతా మంగళ హారతులతో రేఖానాయక్‌కు స్వాగతం పలికారు. మీ వెంటే ఉంటామని ఆమెకు భరోసా కల్పించారు. ప్రజల్లో ఉన్న ఉత్సాహాన్ని చూసిన రేఖానాయక్ వారినుద్దేశించి మాట్లాడారు. నాలుగేళ్ల కాలంలో అభివృద్ధి అంత ప్రజల కళ్లముందే కనిపిస్తుందని, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి అత్యల్ప కాలంలోనే చేశామని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్ ద్వారా రైతు పంటకు ఇబ్బందులు లేకుండా చేశామని, నేడు గ్రామాల్లో సైతం 24 గంటల కరెంట్‌తో ప్రజల ఇబ్బందులు తీర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పునరుద్ఘటించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్, ఆసరా పెన్షన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు.

రెండు దఫాలుగా రూ. 8 వేల చొప్పున పెట్టుబడులు అందించడం, ఎల్‌ఐసీ ద్వారా ఉచిత బీమా సౌకర్యం కల్పించడంతో పాటు, అనివార్య కారణాల వల్ల రైతు మరణిస్తే నామినికి రూ. 5 లక్షల ఇచ్చిన ఘనత కేవలం టీఆర్‌ఎస్ సర్కారు మాత్రమే దక్కుతుందని అన్నారు. ఇదే మండలంలోని బుట్టాపూర్ గ్రామంలో రెండు దఫాలుగా దళితులకు మూడెరకాల చొప్పున భూమిని కొనుగోలు చేసి ఇచ్చామని గుర్తు చేశారు. మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు అవకాశం కల్పిస్తే తెలంగాణ రాష్ర్టాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతారని అన్నారు. అనేక మంది నాయకులు ఆయనపై బురదజల్లే ప్రయత్నాలు ఎన్ని చేసిన వచ్చేది టీఆర్‌ఎస్ సర్కారేనని పునరుద్ఘటించారు. ప్రతిపక్షాల మోస పూరిత మాటలను ప్రజల నమ్మవద్దని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు తక్కళ్ల సత్యనారాయణ, భుక్యా బాపురావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు భుక్యా రాజునాయక్, ముడికె ఐలయ్యయాదవ్, కడెం మండల ప్రధాన కార్యదర్శి కోల గంగన్న, నాయకులు బేర చక్రపాణి, ఆకుల లచ్చన్న, మాజీ సర్పంచులు సిర్ప సంతోష్, బండ రాజ్‌కుమార్, చుంచు భూమన్న, గాజర్ల రాజేశం, వర్థెల్లి మల్లేశ్‌రెడ్డి, ఇల్లసారం కమలాకర్‌గౌడ్, గుజ్జుల తిరుపతి, జుంబర్తి రాజన్న, సుధాకర్, సత్యం, రాజనర్సయ్య, గోపి, హపావత్ రాజేందర్‌నాయక్, రాములు, సురేశ్‌నాయక్, రాజు, ఇందూర్‌నేత, ఒడ్నాల సతీశ్, పీలి రాజేందర్, సిద్ధునాయక్, అయా గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శలు, నాయకులు, తదితరులున్నారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...