లక్ష్మీనరసింహ ఆలయంలో రేఖానాయక్ ప్రత్యేక పూజలు


Tue,September 11, 2018 12:57 AM

దస్తురాబాద్ (కడెం) : దస్తురాబాద్ మండలకేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కొండమాచారి మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు కంకణం కట్టి పూజలు జరిపించారు. అనంతరం దస్తురాబాద్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాములు రేఖానాయక్‌కు ఆలయంలో చెక్కరతో తులభారం వేయించారు. ఈ సందర్భంగా రేఖానాయక్ మాట్లాడుతూ...వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, తిరిగి మరోసారి తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని పూజలు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రభుత్వం ఇచ్చిన నిధులు, తాను చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తిరిగి టీఆర్‌ఎస్ పార్టీకి సానుకూలంగా ఉండనున్నట్లు తెలిపారు. తనకు సహకరిస్తున్న పార్టీ నాయకులు, ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు తక్కళ్ల సత్యనారాయణ, భుక్యా బాపురావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు భుక్యా రాజునాయక్, ముడికె ఐలయ్యయాదవ్, కడెం మండల ప్రధాన కార్యదర్శి కోల గంగన్న, నాయకులు బేర చక్రపాణి, ఆకుల లచ్చన్న, మాజీ సర్పంచులు సిర్ప సంతోష్, బండ రాజ్‌కుమార్, చుంచు భూమన్న, గాజర్ల రాజేశం, మల్లేశ్‌రెడ్డి, కమలాకర్‌గౌడ్, గుజ్జుల తిరుపతి, జుంబర్తి రాజన్న, సుధాకర్, సత్యం, రాజనర్సయ్య, గోపి, హపావత్ రాజేందర్‌నాయక్, రాములు, సురేశ్‌నాయక్, రాజు, ఇందూర్‌నేత, ఒడ్నాల సతీశ్, పీలి రాజేందర్, సిద్ధునాయక్, అయా గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శలు, స్థానిక నాయకులు, తదితరులున్నారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...