ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ గెలుస్తా


Tue,September 11, 2018 12:57 AM

కుంటాల : టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల ఆశీర్వాదాలే తనను మరోసారి గెలిపిస్తాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జి. విఠల్‌రెడ్డి అన్నారు. మండలంలోని సూర్యాపూర్ గ్రామంలో ఉన్న రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మునుపెనడూ లేని విధంగా నాలుగున్నర ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామన్నారు. తనకు టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నాయకులు సవ్వి అశోక్‌రెడ్డి, దొనికెన వెంకటేశ్, పడకంటి దత్తు, రాజు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే అభ్యర్థికి సన్మానం
బైంసా రూరల్ : ముథోల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి విఠల్‌రెడ్డిని లింగా గ్రామస్తులు టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారని, అందుకే సీఎం కేసీఆర్ తిరిగి టికెట్ కేటాయించారన్నారు. విఠల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో సాయబ్‌రావ్, యశ్వంత్, గంగాధర్, కొండిబ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...