పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి


Tue,September 11, 2018 12:57 AM

భైంసా/ నమస్తే తెలంగాణ : పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని డీఎస్పీ బల్ల రాజేశ్ అన్నారు. సోమవారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఇరు వర్గాలతో శాంతికమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు వర్గాలు కలిసి మెలిసి ఉంటూ భైంసా అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. రానురాను గణేష్ బందోబస్తుకు పోలీసులను తగ్గించుకుంటూ పోవాలని గణేశ్ మండపాల నిర్వాహకులే సైనికుల్లా తమ పని తాము చేసుకొని పోవాలని సూచించారు. పోలీసు శాఖ నిబంధనల ప్రకారం నిర్వాహకులు వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాస్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు సి. శంకర్, కృష్ణదాస్, మురళీగౌడ్, బబ్రు మహరాజ్, పురస్తు చిన్నన్న, ఇద్రిజ్,అమిర్, బోసి కిషన్, రఘువీర్, డా. పోశెట్టి, ఎజాజ్‌ఖాన్, బాలాజీ సూత్రావే, నిజాం వేణుగోపాల్, ఫారూఖ్ తదితరులున్నారు.

ముథోల్‌లో..
ముథోల్: నవరాత్రి, గణేశ్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని భైంసా డీఎస్పీ రాజేశ్ బల్ల అన్నారు. సోమవారం ముథోల్‌లోని జీఏం గార్డెన్‌లో ముథోల్, తానూరు, బాసర , లోకేశ్వరం మండలాలకు చెందిన గణే శ్ మండపాల నిర్వాహకులు, నాయకులు, గ్రామ పెద్దలతో శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కలిసి మెలసి ఉత్సవాలను శాంతియుత వాతవరణంలో జరుపుకోవాలని సూచించారు.

సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీని నాయకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సైలు భరత్‌సుమన్, మహేశ్, రాజన్న, రాంనర్సింహారెడ్డి, మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు ఎజాజొద్దీన్, మాజీ సర్పంచ్ అనిల్, వీడీసీ అధ్యక్షుడు ధర్మన్న, ఉత్సవ సమితి అధ్యక్షుడు రవియాదవ్, నాయకులు రోళ్ల రమేశ్, దశరథ్ మండపాల నిర్వాహకులు తదితరులున్నారు.

కుభీర్‌లో..
కుభీర్: పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని భైంసా రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ కోరారు. మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడారు. గణేశ్ ఉత్సవాలు, మొహర్రం పండుగలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు. సౌండ్ సిస్టంలకు పోలీసుల అనుమతి, కరెంట్ సరఫరా కోసం విద్యుత్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు.
నేడు మండప నిర్వాహకులతో సమావేశం...పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు శాంతి కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. మండలంలోని వివిధ గణేశ్ మండప నిర్వాహకులు హాజరు కావాలని కోరారు. కుభీర్ ఎస్సై రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...