వారసత్వ సాగునీటి కట్టడంగా సదర్‌మాట్


Mon,September 10, 2018 02:51 AM

నిర్మల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తె లంగాణ : సదర్‌మాట్‌ను కేంద్ర ప్రభు త్వం వారసత్వ సాగునీటి కట్టడంగా గుర్తించింది. 1891-92 సంవత్సరం లో నిజాం కాలంలో జిల్లాలోని ఖానాపూర్ మండలం మేడంపల్లి సమీపంలో గోదావరి నదిపై ఎడమవైపున సదర్‌మాట్ ఆనకట్ట నిర్మించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు దిగువన గోదావరి నదికి ఎడ మ వైపున ఆనకట్ట నిర్మించారు. 126 సంవత్సరాల క్రితం నిజాం కా లంలో ఫ్రెంచ్ ఇంజనీర్ జేజే ఓట్లే ఆధ్వర్యంలో నైజాం తాలుక్ దార్ విల్‌కిన్‌సన్ నిర్మించారు. గోదావరి నది ప్రవా హం మళ్లించడం ద్వారా ఆనకట్ట నుం చి ఆయకట్టుకు నీటి సరఫరా చేసేందుకు వీలుగా ఉంది. ఖానాపూర్‌కు సు మారు 7 కిలో మీటర్ల దూరంలో గోదావరి నదిలో పొడగాటి ఆడ్డుగోడను ని ర్మించి సదర్‌మాట్ కాలువను సృష్టించారు. సహజ సిద్ధంగా గోదావరిలో నీరుంటే ఈ సదర్‌మాట్ కాలువ ఏటా రెండు పంటలకు సాగు నీరు అందిస్తోంది. అందుకే ఖానాపూర్ ప్రాంతాని కి కాలువ పట్టె అనే పేరు కూడా వ చ్చింది. ఈ ఆనకట్ట నుంచి ఖానాపూర్, కడెం మండలాల్లోని 13,100ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు.

ఈ ఆనకట్ట నుంచి 4.129 టీఎంసీ ల నీటిని వినియోగించుకునేందుకు వీలుగా నిర్మించారు. 7.76 లక్షల క్యూ సెక్కుల వరదనీటిని కిందికి వదిలేందుకు వీలుగా ఈ ఆనకట్టను నిర్మించా రు. ఈ ఆనకట్టకు రెండు కాలువలతో పాటు ఒక డిస్ట్రిబ్యూటరీ ఉంది. ఎడమ ప్రధాన కాలువ 21.53కి.మీ.పొడవు ఉండగా.. 525 క్యూసెక్కుల సామర్థ్యం కలిగి ఉంది. 18 గ్రామాల్లో 5700 ఎకరాల ఆయకట్టు సాగవుతుండగా.. ప్ర ధానంగా వరి పంటను సాగు చేస్తారు. కుడి ప్రధాన కాలువ 10 కి.మీ. పొడవు ఉండగా.. 25 క్యూసెక్కుల సామర్థ్యం కలిగి ఉంది. ఒక గ్రామంలో 3400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. వరి పంటను సాగు చేస్తారు. డిస్ట్రిబ్యూటరీ పొడవు 12 కి.మీ. ఉండ గా 25 క్యూసెక్కుల సామర్థ్యం కలిగి ఉంది. ఏడు గ్రామాల పరిధిలో నాలు గు వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. వరి పంటను వేస్తారు. ఎడమ ప్రధాన కాలువ నుంచి ఆయకట్టుకు నీరు ఇ స్తుండగా.. 21.53కి.మీ. అనంతరం క డెం మండలం ధర్మాజిపేట వద్ద వాగు లో కలుస్తుంది. అక్కడి నుంచి 3.5 కి.మీ. ఫీడర్ ఛానల్ ఉండగా ఈ నీరు కడెం రిజర్వాయర్‌లోకి చేరుతోంది.

రెండు దశాబ్దాల క్రితం వరకు ఏటా రెండు పంటలకు గోదావరి ద్వారా సా గు నీరందుతూ, సదర్‌మాట్ ఆయకట్టు ఆన్నపూర్ణగా విలసిల్లింది. ఉచిత కరెం టు రావడంతో గోదావరికి ఇరువైపు గట్లపై కొన్ని వేల మోటార్లు పెట్టి పంట లు పండిస్తుండడంతో వేసవిలో గోదావరిలో నీటి కొరత ఏర్పడి రెండు పంట ల స్థానంలో ఒకే పంట పండించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎస్సారెస్సీని 1962లో నిర్మించాక గోదావరి ప్రవా హం తగ్గింది. నీటి లభ్యత లేక ఆయకట్టు రైతులకు రెండు పంటలు పండిం చే పరిస్థితి లేకుండాపోయింది. కొన్నిసార్లు వానాకాలం సీజన్‌లో కూడా తీవ్ర నీటి కొరతను ఎదుర్కోవలసి వ చ్చింది. సదర్‌మాట్ ఆనకట్ట వద్ద నీటి నిల్వ లేకపోవడంతో సదర్‌మాట్ బ్యా రేజీ నిర్మాణం చేపట్టాల్సి వస్తోంది. ది గువ పరీవాహక ప్రాంత రైతు ల హక్కులను పరిరక్షించాలనే ఉద్దేశం తో ఈ బ్యారేజీని నిర్మించాలని గత ప్ర భుత్వం నిర్ణయించింది. సదర్‌మాట్ ఆనకట్ట ఎగువన మామడ మండలం పొన్కల్, నల్దుర్తి మధ్యలో రూ.315. 58 కోట్లతో బ్యారేజీ నిర్మాణం చేపట్టింది.

మంత్రి హరీశ్‌రావు హర్షం...
సదర్‌మాట్ ఆనకట్టకు కేంద్ర ప్రభు త్వం వారసత్వ సాగునీటి కట్టడంగా గుర్తించినందుకు రాష్ట్ర సాగు నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఈఎన్‌సీ నాగేందర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. వారసత్వ కట్టడాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి కట్టడాలు వందల సంఖ్యలో ఉన్నాయని తెలిపారు. తూములు, మత్తడి, ఆనకట్టలు వందల సంఖ్యలో ఉన్నాయని వాటిని గుర్తించి చారిత్రాక సమాచారం, ఫొటోలు, శిలా ఫలకాలు, శాసన ఆధారాలు అందించాలని ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశామని ఈఎన్‌సీ నాగేందర్ తెలిపారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...