శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్


Mon,September 10, 2018 02:49 AM

నిర్మల్ క్రైం : జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఆదివారం కార్డన్ సెర్చ్ చేపట్టారు. వేకువ జామున పట్టణ సీఐ జాన్‌దివాకర్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలను ప్రారంభించారు. ప్రతి ఇంటిని పరిశీలిస్తూ వాహనాలను, పరిసరాలను తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకే పోలీసులు తనిఖీలను చేపట్టడం జరుగుతుందన్నారు. 8 పార్టీలను ఏర్పాటు చేసి దాదాపు 250 ఇండ్లను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో నిరంతరం ఈ కార్డన్ సెర్చ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఎప్పుడు ఎక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారోననే అనుమానంతో నిందితులు భయబ్రాంతులకు గురవుతున్నారని, శివారు ప్రాం తాలతో పాటు అన్ని చోట్ల తనిఖీలు చేపడుతామని అన్నారు. ప్ర జలు ఎప్పటికప్పుడు అప్రమత్తం గా ఉండాలని సూచించారు. మా రుతున్న కాలానికి అనుగుణంగా యువతలో మంచి మార్పులు చేసుకోవాలని, దొంగతనాలు, దోపిడీలు, హత్యలకు పాల్పడి విలువైన జీవితాన్ని వృథా చేసుకోవద్దన్నారు.

మితిమీరిన వేగంతో వాహనానలు నడుపుతూ ఇతరులకు ఇబ్బందులు కల్గించి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని, ద్విచక్ర వాహనాలు నడిపే వారందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు. బతుకుదెరువుకోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ వివిధ రకాల పనులను చేసుకుంటూ దొంగతనాకు పాల్పడే అవకాశం ఉన్నందున పోలీసులు ఎక్కడికైనా వచ్చి తనిఖీలు చేయగలరని, దొంగల్లో భయం పుట్టించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. అలాగే కాలనీల్లో కొత్తగా వచ్చే వారిపై నిఘా ఉంచాలని, ఇండ్లల్లో అద్దెకు దిగేవారి పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాతనే ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు.

అసాంఘిక శక్తుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అనేక శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని, పోలీస్ శాఖలో చేరడానికి అర్హత కల్గిన నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చామని గుర్తు చేశారు.అ లాంటి వారు ఎవరైనా ఉంటే పోలీసు అధికారులను సంప్రదించాలన్నారు. కాలనీ వాసులందరూ అనుమానితులు కాలనీలోకి ప్రవేశించకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, దీంతో అనుమానితులను పట్టుకోవడం సులభమవుతుందన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...