దేవాలయ భూములు కాపాడండి...


Mon,September 10, 2018 02:48 AM


సారంగాపూర్ : అడెల్లి పోచమ్మ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని మంత్రి ఇంద్రకరనణ్‌రెడ్డి దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. సారంగాపూర్ మండలంలోని శ్రీమహా అడెల్లి పోచమ్మ దేవాయాలన్ని మంత్రి దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో అర్చకుడు శ్రీనివాస్‌శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని, ప్రైవేటు వ్యక్తులు ఆలయం వద్ద కమర్షియల్ కోసం భూములను ఉపయోగించుకుంటున్నారన్నారు. దీంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తున్నాయన్నారు. కోనేరు పక్కన ఉన్న భూములను సర్వేచేయాలని అందులో ప్రైవేటు వ్యక్తుల భూములు ఉంటే ఆ భూములను దేవాలయానికి తీసుకొని నష్ట పరిహారం అందించాలని అధికారులకు ఆదేశించారు. లేదంటే వ్రేటు వ్యక్తులు ఆలయం వద్ద కూడా వివిధ వ్యాపారాలు చేసుకునే వీలుందని త్వరగా సర్వేచేసి భూములను కాపాడాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్లావెంకట్‌రాంరెడ్డి, మార్కెట్ చైర్మన్ రాజ్‌మహ్మద్, అడెల్లి పోచమ్మ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వంగరవీందర్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి నారాయణరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుకర్‌రెడ్డి, ఎంపీటీసీ మహే శ్, నాయకులు జీవన్‌రావ్, రొడ్డమారుతి, దేవిశంకర్, ఎల్లన్న, మల్లేశ్, మాధవరావు, సూర్యం, మానిక్‌రెడ్డి, కండెల భోజన్న, బోసానిభోజన్న, కత్తెరపాక భూమేశ్, ఉట్లరాజేశ్వర్, నర్సారెడ్డి, సాయన్న, దేవాదాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

129
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...