స్వరాష్ట్రంలోనే దేవాలయాల అభివృద్ధి


Mon,September 10, 2018 02:48 AM

నిర్మల్ కల్చరల్ : తెలంగాణ రాష్ట్రంలోనే దేవాలయాల అభివృద్ధి వేగంగా జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయం,నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆదివారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రి అల్లోలకు వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి ఇంత వేగంగా జరగలేదని, రాష్ట్ర ముఖ్య మంత్రి దేవాలయాల అభివృద్ధికి జిల్లాకు ఎన్నో కోట్ల నిధులను విడుదల చేశారని తెలిపారు. బాసర ఆలయంతో పాటు జిల్లా కేంద్రంలోని నందిగుండం దుర్గామాత ఆలయం,చింతకుంట వాడ హనుమాన్ ఆలయాల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని అన్నారు. వివిధ మండలాల్లోని పలు ఆలయాలకు నిధుల మంజూరుతో పాటు జిల్లాలో నిరాదరణకు గురైన అనేక ఆలయాలకు దూపదీప నైవేద్యాల కింద నిధులను మంజూరు చేయడంతో నిత్యం పూజలు జరుగుతున్నాయని గుర్తు చేశారు

. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి ఆలయాల అభివృద్ధిపై గత పాలకులు వివక్ష చూపారని అందుకే ఆలయాల అబివృద్ధిలో మన ప్రాంతం పూర్తిగా వెనుకబడిందని అన్నారు. నందిగుండం ఆలయంలో గోమాతకు పూజలు చేపట్టారు. అనంతరం నందిగుండం దుర్గామాత ఆలయ అధ్యక్షుడు లక్కడి జగన్‌మోహన్ రెడ్డి మంత్రి దంపతులను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి దంపతులను పూలమాల శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో నందిగుండం దుర్గామాల ఆలయ వ్యవస్థాపకులు కొండాజి వెంకటాచారి, ముత్యం సంతోష్ గుప్తా, పోశెట్టి, రాజన్న, శంకర్, నరహరి, రమేశ్, మోహన్‌దాస్, రేణుకాదాస్, లక్ష్మీనారాయణ, కందులపండరి, జోగుభూషణ్, లింగారెడ్డి, అయ్యప్ప ఆలయ గురుస్వామి చనిగారపు చిన్నయ్య, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, గురుస్వామి మురళి తదితరులున్నారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...