అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి కాళోజీ


Mon,September 10, 2018 02:47 AM

నిర్మల్‌టౌన్ : ప్రముఖ కవి, రచయిత కాలోజీ నారాయణరావ్ జయంతి వేడుకలను కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అధికారికంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి రమేశ్ రాథోడ్ ఆధ్వర్యంలో కవులు, కళాకారులు కాలోజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాలోజీ తెలంగాణ ఉద్యమంతో పాటు అణగారిన వారి హక్కుల కోసం అనేక ఉద్యమాలను చేశారన్నారు. ముఖ్యంగా రజాకార్లకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం నేటికీ స్ఫూర్తి దాయకమని డీఆర్వో తెలిపారు. ప్రభుత్వం కాలోజీ నారాయణ్‌రావు సేవలను గుర్తించి ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. సమాజాన్ని చైతన్యం చేసిన గొప్ప కవిగా అభివర్ణించారు. కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలానాధికారి కలీంతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి, కళాకారులు ఎలిశెట్టి సుదర్శన్, సుధాకర్‌స్వామి, రఘునాథ్, చెనిగారపు నాగరాజు, రమేశ్, రాజ్‌కుమార్, మాధూరి రాజు తదితరులు పాల్గొన్నారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...