కొనసాగుతున్న కంటి వెలుగు


Sat,September 8, 2018 01:20 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ: జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతిరోజు కంటి వెలుగు శిబిరాల వద్ద జనం ఉత్సాహంగా తరలివస్తున్నారు. ఉచితంగా కంటి వైద్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలు, కంటి అద్దాలు ఉచితంగా అందజేస్తుండటంతో శిబిరాలకు వస్తున్న జనం ఓపికగా శిబిరాల వద్ద ఉండి చికిత్సలు పొందుతున్నారు. విలువైన కంటి అద్దాలు కూడా ఉచితంగా అందిస్తుండటంతో లబ్దిదారులు సంబురపడుతున్నారు. 19 మండలాల్లో 16 కంటి వైద్య బృందాలు నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాటికి జిల్లాలో 44092 మందికి ఇప్పటివరకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ జలపతినాయక్ వెల్లడించారు. కాగా వీరిలో 4835 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని వీరికి హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్, సరోజినిదేవీ, ముధోల్‌లోని గోపాల్‌రావు బోస్లే ఎల్‌వీ ప్రసాద్, ఆదిలాబాద్‌లోని శేషన్నచెన్నావార్ కంటి ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలకు పంపుతున్నట్లు వెల్లడించారు. అలాగే కంటి అద్దాలు అవసరమని నిర్ధారించిన మీదట 10,034 మంది లబ్దిదారులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. కంటి వైద్య పరీక్షలను ఇకపై మరింత ముమ్మరంగా చేయనున్నట్లు ఆయన వివరించారు.

139
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...