కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద


Fri,September 7, 2018 12:02 AM

కడెం : నిర్మల్ జిల్లా కడెం జలాశయంలోకి వరదనీటి రాక కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 698.500 అడుగులు 7.214టీఎంసీల) వద్ద ఉంది. గురువారం ఎగువ ప్రాంతాల నుంచి 1892 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉండడంతో అధికారులు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకొని ఒక వరదగేటును ఎత్తి 2714 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేశారు. కుడి కాలువకు 18 క్యూసెక్కులు, ప్రధాన కాలువ ద్వారా 907 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

142
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...