టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆనందం


Fri,September 7, 2018 12:02 AM

ఖానాపూర్: ఖానాపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌నే మరోమారు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు గురువారం సంబురాలు జరిపారు. విద్యానగర్‌లోని ఎన్‌టీఆర్ చౌరస్తాలో పటాకులు కాల్చారు. అనంతరం కార్యకర్తలంతా ఖానాపూర్ ప్రధాన వీధుల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీతో తెలంగాణ చౌరస్తాకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఇక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు బక్కశెట్టి కిషోర్ సారధ్యంలో ఈ సంబురాలు జరిగాయి. తెలంగాణ చౌరస్తాలో పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. పరస్పరం కార్యకర్తలు స్వీట్లు తినిపించుకున్నారు. ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కూడా పార్టీ కార్యకర్తలు రేఖానాయక్‌కు టికెట్ పట్ల సంబురాళు చేసుకున్నారు. గోసంపల్లెలో, తర్లాపాడులో బైక్ ర్యాలీలు నిర్వహించారు. పెంబి మండలంలో కూడా టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సక్కారాం శ్రీనివాస్, జడ్పీటీసీ తాళ్లపెళ్లి సునీత, ఆర్‌ఎస్ మండల కన్వీనర్ పుప్పాల గజేందర్, కడార్ల గంగనర్సయ్య, డబ్బ శ్రీనివాస్, బక్కశెట్టి కిషోర్, గొర్రె గంగాధర్, అంకం రాజేందర్, డాక్టర్ కేహెచ్ ఖాన్, రాజగంగన్న, గుగ్గిళ్ల రాజేందర్, సతీశ్, సయ్యద్ ఫయీమ్, షేక్ నసీర్, షేక్ మోయీన్, కౌట మహేశ్, రామిడి మహేశ్, పెద్ది మల్లేశ్, లింగన్న, నామెడ ధర్మరాజు, కొప్పుల రాజేశ్వర్, జగడం గాంధీ, వొల్గుల వెంకటేశ్, కరిపె శ్రీనివాస్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

137
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...