స్వచ్ఛ భారత్, హరితహారంలో జిల్లా పేరు నిలబెట్టాలి


Fri,September 7, 2018 12:02 AM

నిర్మల్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై జిల్లా స్థాయి అధికారులతో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నాలుగో విడత హరితహారంలో జిల్లాలో ఒక కోటీ 2 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటి వరకు 77 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. సెప్టెంబర్ నెలాఖకల్లా అన్ని శాఖ అధికారులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నాటిన మొక్కలను సంరక్షించుకోకుండమే కాకుండా ప్రతి రోజూ గార్డెన్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న గార్డెన్ల నిర్వహణపై వారం రోజుల కోసారి సమీక్ష నిర్వహిస్తామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పూలమొక్కలు పెంచి గార్డెన్ చేపట్టాలన్నారు.

బయోమెట్రిక్ అంటే భయమెందుకు..?
జిల్లాలో అధికారుల తీరును పారదర్శకంగా వ్యవహరించేందుకు అన్ని శాఖల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించినా కొన్ని శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు జవాబుదారీగా పని చేయాల్సిన అధికారులు బయోమెట్రిక్ అంటే భయమెందుకు పడుతున్నారని అర్థం కావడంలేదంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఏయే శాఖలో బయోమెట్రిక్ అమలు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇక నుంచి అన్ని శాఖల్లో బయోమెట్రిక్ అమలు చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జేసీ భాస్కర్‌రావు, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, డీఆర్వో రమేశ్ రాథోడ్, నిర్మల్, భైంసా ఆర్డీవోలు ప్రసూనాంబ, రాజు, డీఈవో ప్రణీత, డీపీవో శ్రీనివాస్ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

164
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...