సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట


Wed,September 5, 2018 11:46 PM

-రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
-ఖానాపూర్‌లో ఫైర్ స్టేషన్ ప్రారంభం

ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంత్రి బుధవారం ఖానాపూర్‌లో స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌తో కలిసి అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 22 అగ్నిమాపక కేంద్రాలను మంజూరు చేసిందని తెలిపారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో మంత్రి అల్లోల హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్స్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేశారు.

-ఖానాపూర్/నిర్మల్/ నమస్తే తెలంగాణ:సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఖానాపూర్‌లో నూతనంగా నిర్మించిన ఫైర్ స్టేషన్‌ను బుధవారం స్థానిక శాసన సభ్యురాలు అజ్మీరా రేఖానాయక్‌తో కలిసి మంత్రి అల్లోల ప్రారంభించారు. ఫైర్ ఇంజన్‌ను, స్టేషన్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించి అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ, ఖానాపూర్‌లో ఫైర్‌స్టేషన్ కార్యాలయం, సిబ్బంది నివాస భవనాల కట్టడాల కోసం రూ.84 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని, మొదటి విడుతగా రూ.24.50 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. కుమ్రం భీం చౌరస్తాలోని రెండెకరాల ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టనున్నామని చెప్పారు

కుప్టి ఘాట్లలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్...


ఖానాపూర్, కడెం మండలాల రైతుల కోసం రూ.550 కోట్లతో చేపట్టిన సదర్‌మాట్ బ్యారేజీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, గేట్లు బిగించే పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు. ఈ బ్యారేజీకి మొత్తం 52 గేట్లను అమర్చనున్నామని తెలిపారు. తొందరగా నిండి, తొందరగా ఖాళీ అయ్యే కడెం ప్రాజెక్టులో ఆవసరమైనప్పుడు నీటిని నింపుకొనేందుకు కుప్టి ఘాట్లలో రూ.800 కోట్లతో 6 టీఎంసీల నీరు నిలిచేలా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించనున్నామని చెప్పారు. ఇక్కడ విద్యుత్ ఉత్పాదక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కడెం 13వ డిస్ట్రిబ్యూటరీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రేఖ ప్రతిపాదనల మేరకు నిధులను మంజూరు చేశామన్నారు.

ఖానాపూర్‌లో మున్సిఫ్ కోర్టు ఏర్పాటుకు కృషి...


ఎమ్మెల్యే రేఖానాయక్ విన్నపం మేరకు ఖానాపూర్‌లో మున్సీఫ్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. 200 రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పనులు చేపడతామని పేర్కొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ఎన్నో ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారంటూ మంత్రి ఐకేరెడ్డికి ఎమ్మెల్యే ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఖానాపూర్‌లో మున్సిఫ్ కోర్టు త్వరగా ఏర్పాటయ్యేలా చూడాలని మంత్రికి విన్నవించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులు త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఆమె కోరారు. ఖానాపూర్ కొత్త మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు సరిపోవని మంత్రి కేటీఆర్‌కు విన్నవించగా మరో రూ.20 కోట్లను అదనంగా మంజూరు చేయడానికి అంగీకరించిన మంత్రి కేటీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మంత్రిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సక్కారాం శ్రీనివాస్, జడ్పీటీసీ తాళ్లపెల్లి సునీత, జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్ల వెంకట్రామ్‌రెడ్డి, జిల్లా సభ్యుడు పుప్పాల శంకర్, ఖానాపూర్ మండల కో-ఆర్డినేటర్ పుప్పాల గజేందర్, కడెం మండల కో-ఆర్డినేటర్ హపావత్ రాజేందర్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు పాకాల రాంచందర్, అయ్యన్నగారి రాజేంధర్, ముత్యంరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ సాగి లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్ ఖానాపూర్ మండల అధ్యక్షుడు బక్కశెట్టి కిషోర్, ఏఎంసీ వైస్ చైర్మన్ గోపిడి రవీందర్‌రెడ్డి, సభ్యులు ఐల్నేని అశోక్‌రావు, జన్నారపు శంకర్, జి.సతీశ్, మాజీ జడ్పీటీసీ రాథోడ్ రామునాయక్, ఆర్‌ఎస్‌ఎస్ తిమ్మాపూర్ కో-ఆర్డినేటర్ కడార్ల గంగనర్సయ్య, ఖానాపూర్ కో-ఆర్డినేటర్ డబ్బ శ్రీనివాస్, జిల్లా ఫైర్ అధికారి బి.కేశవులు, సహాయ అధికారి ధర్మ, నిర్మల్ ఫైర్ అధికారి, ఖానాపూర్ ఇన్‌చార్జి మల్లయ్య, భైంసా అధికారి చరణ్, ఫైర్‌మన్లు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...