ఉరి వేసుకొని జంట ఆత్మహత్య


Wed,September 5, 2018 11:42 PM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ : గిరిజన యువతి, యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని నర్సాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని నర్సాపూర్-బీ గ్రామానికి చెందిన సెడ్మకి అర్జున్ (22) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మడావి సావిత్రిబాయి (18) వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది. వీరు ఇరువురు ఉదయమే ఇంట్లో నుంచి వెళ్లి బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని రాగిచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని మొదట పశువుల కాపరి చూసి గ్రామస్తులకు సమాచారం అందించారని తెలిపారు. విషయంపై గ్రామస్తులు కాని ఇరువురి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోగా, శవాల వద్దకు ఎవరూ రాకపోవడంతో సీఐ వినోద్ గ్రామానికి చేరుకొని గ్రామస్తులను, కుటుంబీకులను కలిసి వివరాలు సేకరించారు. దీనిపై గ్రామస్తులు, కుటుంబీకులు తమకు తెలియదని పోలీసులతో అన్నారని తెలిపారు. దీంతో వీఆర్‌వో మంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులు శవాలు అప్పగించామని సీఐ తెలిపారు. విచారణ పూర్తిచేసి వివరాలు వెల్లడిస్తామన్నారు.

187
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...