8న జాతీయ లోక్ అదాలత్


Wed,September 5, 2018 11:42 PM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ అరుణ సారిక పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 8న నిర్వహిస్తున్నట్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని రకాల సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద పరిహార కేసులు పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని వివరించారు. ఈ లోక్ అదాలత్‌లో సామరస్య పూర్వకమైన పరిష్కారాన్ని వేగవంతంగా పొందవచ్చని తెలిపారు. ప్రజలు, కక్షిదారులు జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆదిలాబాద్‌లో నిర్వహించే లోక్‌అదాలత్ ద్వారా తమ కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలని సూచించారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...