పోషించలేక వదిలేశారు


Wed,September 5, 2018 11:41 PM

ఎదులాపురం : ముగ్గురు ఆడపిల్లలను పోషించడం కష్టమని భావించిన ఆ అమ్మానాన్న రైల్వే స్టేషన్‌లో వారిని వదిలేసి కర్కశత్వం చాటితే చైల్డ్‌లైన్ ద్వారా శిశుగృహ వారిని ఆదరించింది. జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గోల్ బంగ్లా బస్తీ ఏరియాలో ముగ్గురు చిన్నారులు ఏడుస్తూ ఉండడం గమనించిన ఒక మహిళ 1098 చైల్డ్‌లైన్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించింది. వెంటనే చైల్డ్‌లైన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఏడుస్తున్న ముగ్గురు చిన్నారులను ఓదార్చి వివరాలు అడిగారు. తమది బెల్లంపల్లి అని , తల్లిదండ్రుల పేర్లు రాణి, రాజు అని చెప్పారు. మొదటి అమ్మాయి ఇందూ ( 7) నందిని (5) నిత్య (18 నెలలు) లను మంగళవారం 4వ తేదీ వరకు చైల్డ్‌లైన్ వారు తమ కేంద్రంలో సంరక్షించారు. తల్లిదండ్రులు, బంధువుల నుంచి పోలీసు స్టేషన్లలో పిల్లలు తప్పిపోయినట్లు ఫిర్యాదు రాకపోవడంతో బుధవారం జిల్లా కేంద్రంలోని శిశుగృహంలో అప్పగించారు. పిల్లల తలిదండ్రులు బంధువులు ఎవరైనా పూర్తి ఆధారాలతో వస్తే పిల్లలను అప్పగిస్తామని డీసీపీవో అన్నారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు వివరించారు. పిల్లల తలిదండ్రులు 60 రోజుల్లో రాకపోతే ఈ పిల్లలను అనాథలుగా పరిగణించి వారి సంరక్షణ, పునరావాసం తీసుకుంటామని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 9440555872 సంప్రదించాలని సూచించారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...