కూలిన పాఠశాల పైకప్పు.. తప్పిన ప్రమాదం


Wed,September 5, 2018 11:41 PM

ముథోల్ : బాసర మండలంలోని టాక్లీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలడంతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు ఛాయా, ఆమె కూతురు అక్షిత గాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోని తాగునీటి కోసం పాపతోపాటు ఉపాధ్యాయురాలు ఆఫీస్ గదిలోకి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా పాఠశాల పైకప్పు కూలడంతో ఇద్దరి తలలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స కోసం వారిని ముథోల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పాఠశాల పైకప్పు కూలడంతో తమ పిల్లలను పాఠశాలకు ఎలా పంపించాలో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నాతాధికారులు పాఠశాల స్థితిపై దృష్టి సారించి మరమ్మతులను చేపట్టాలని కోరుతున్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...