తపాల ఉద్యోగి అదృశ్యం


Wed,September 5, 2018 11:41 PM

నర్సాపూర్ (జి) : మండలం లోని గొల్లమాడ తపాల కార్యాలయం పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రెడ్డిమల్ల ముత్తగౌడ్ అదృశ్యంమైనట్లు బుధవారం నర్సాపూర్ (జి) పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందని ఎస్సై జి బాలకృష్ణ అన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. స్వగ్రామం లోనే విధులు నిర్వహిస్తున్న ముత్తగౌడ్ సోమవారం కుంటాల పోస్టు ఆఫీసు నుంచి పెన్షన్‌కు సంబంధించిన రూ. 10 లక్షలు డ్రా చేసుకున్నారని బూరుగుపల్లి తండాలో రూ. 80 వేలు పెన్షన్ డబ్బులు పంపిణీ చేయగా, మిగితా రూ.9.20 లక్షలు ముత్తగౌడ్ వద్ద ఉన్నాయని, రెండు రోజులుగా ముత్తగౌడ్ కనిపించక పోవడం, అటు ఆఫీసుకు ఇటు ఇంటికి రాకపోవడంతో భైంసా డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ రాజనర్సాగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...