పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి


Wed,September 5, 2018 11:41 PM

భైంసారూరల్ : పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని భైంసారూరల్ ఎస్సై పున్న చందర్ అన్నారు. బుధవారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో వినాయక మండపాల నిర్వాహకులు, గ్రామస్తులతో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేశ్ విగ్రహ ప్రతిష్ఠాపన చేసే వారు పోలీసులు సూచించిన నిబంధనలకు పాటించాలని సూచించారు. నిర్వాహకులు పోలీసుల వద్ద అనుమతిని తీసుకోవాలన్నారు. రోడ్లపై, కూడళ్లలో విగ్రహాలను ప్రతిష్ఠించకూడదన్నారు. నిర్వాహకులు విద్యుత్ శాఖ అనుమతి తీసుకొని నాణ్యమైన విద్యుత్ తీగలను వాడాలన్నారు. నిమజ్జనం శోభాయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఊరేగింపు సమయంలో సరైన పత్రాలు గల వాహనాలను అద్దెకు తీసుకోవాలన్నారు. అనంతరం ఎస్సై పున్నం చందర్‌ను గ్రామస్తులు, యువకులు పూలమాల, శాలువాతో సత్కరించారు. భూమారెడ్డి, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...