పంచాయతీల్లో కొలువులు...


Wed,September 5, 2018 01:44 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ఏండ్లుగా గ్రామ పంచాయతీ కార్యదర్శలు పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ఏండ్ల తరబడి ఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో గ్రామాల్లో పర్యవేక్షణ కొరవడి ఇబ్బందిగా మారింది. గ్రామాల్లో అభివృద్ధి మాట అటుంచితే జనాల సాధారణ సమస్యలు, రోజువారీ అవసరాలు కూడా తీరలేదు. మూడు, నాలుగు గ్రామ పంచాయతీలకు ఒక కార్యదర్శి ఉండటంతో పల్లెల్లో ప్రగతి పూర్తిగా కుంటుపడింది. ఇక వివిధ సమస్యలు సకాలంలో పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్‌చార్జి బాధ్యతలు ఉండటంతో తమ పరిధిలోని గ్రామాల్లో పన్ను వసూళ్లు కూడా ఇబ్బందికరంగా మారింది. పూర్తి స్థాయిలో గ్రామ కార్యదర్శులు లేకపోవడంతో .. ఉన్న వారిపై పని ఒత్తిడి పెరిగింది. గ్రామ స్థాయిలో ఆయా గ్రామాల పరిశుభ్రత, పన్నుల వసూళ్లు, మురికి కాల్వల నిర్వహణ, విద్యుత్ దీపాల నిర్వహణ, అంటువ్యాధులు ప్రబలకుండా చూడ డం, దోమల నివారణ, స్మశాన వాటికల నిర్వహణ, డంప్ యార్డుల ఏర్పాటు తదితర వాటంటిన్ని గ్రామ కార్యదర్శి పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఒక్కో కార్యదర్శికి మూడు, నాలుగు గ్రామపంచాయతీలకు ఇన్‌చార్జిగా ఉండడంతో పర్యవేక్షణ, పన్నుల వసూళ్లు ఇబ్బందికరంగా మారాయి. తాజాగా కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేయడంతో గ్రామపంచాయతీల సంఖ్య భారీగా పెరిగింది.

నిర్మల్‌లో..
నిర్మల్ జిల్లాలో గతంలో 240 గ్రామ పంచాయతీలకుగాను.. 74మంది ఉన్నారు. ఇందులో 65మంది మాత్రమే పని చేస్తుండడంతో.. ఒక్కొక్కరికీ నాలుగైదు గ్రామాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా గ్రామ పంచాయతీల సంఖ్య 396కు చేరగా.. కొత్తగా మరో 322మంది వరకు భర్తీ చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో 243గ్రామ పంచాయతీలకు 137మంది ఉన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల సంఖ్య 467కు చేరటంతో.. మరో 335మందిని కొత్తగా నియామకం చేయనున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో గతంలో 173 గ్రామపంచాయతీలుండగా.. కొత్తగా 161 గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశారు. దీంతో వీటి సంఖ్య 334కు చేరింది. ప్రస్తుతం జిల్లాలో 101మంది గ్రామ కార్యదర్శులు పనిచేస్తున్నారు. దీంతో తాజాగా మరో 235 మంది గ్రామ కార్యదర్శులు నియమించేందుకు నిర్ణయించారు. మంచిర్యాల జిల్లాలో 210 పాత గ్రామపంచాయతీలుండగా.. 84 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. కొత్తగా 115 గ్రామపంచాయతీలు ఏర్పాటు చేయగా.. నాలుగు గ్రామపంచాయతీలు తీసేయగా.. 311కు చేరింది. దీంతో కొత్తగా 232 గ్రామ కార్యదర్శులను నియమించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 1124 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను నియమించనున్నారు.

అన్ని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు కచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కూడా తీసుకున్న సానుకూల నిర్ణయం గ్రామాల అభివృద్ధికి మేలు చేయనుంది. ఈ కార్యదర్శుల నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈనెల 3 నుంచి 12 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత వారి పనితీరు బట్టి వారిని క్రమబద్ధీకరించేలా నిర్ణయం తీసుకుంటారు. సమర్థవంతంగా విధులు నిర్వహించని వారిని క్రమబద్ధీకరించకుండా ఉండేలా నిబంధనలు రూపొందించారు. కొత్తగా నియామకం కానున్న గ్రామ కార్యదర్శులకు ప్రొబెషనరీ సమయంలో నెలకు రూ.15 వేల జీతం చెల్లిస్తారు. ఉమ్మడి జిల్లాలో 1124 పోస్టులను భర్తీ చేస్తుండగా.. ఇందులో 740పోస్టులు జనరల్ ఉండగా.. 384 పోస్టులు మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శుల్లో మహిళలు ఎక్కువ మంది ఉండనున్నారు. జనరల్ పోస్టులతో పాటు రిజర్వేషన్‌లోనూ మహిళలకు ఉద్యోగాలు రానున్నాయి. ఇక ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 6శాతం, బీసీ(ఏ)కు 7శాతం, బీసీ(బి) 10శాతం, బీసీ (సి) 1శాతం, బీసీ (డి) 7శాతం, బీసీ (ఇ) 4శాతం, వికలాంగులకు 3శాతం, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 2శాతం, స్పోర్ట్స్ కోటాలో 2శాతం ఆన్‌రిజర్వ్ కోటాలో 45శాతం పోస్టులు ఉన్నాయి.

జిల్లాల వారీగా పోస్టుల రిజర్వేషన్లను పరిశీలిస్తే..
ఆదిలాబాద్ జిల్లాలో 335 పోస్టులకుగాను 221 జనరల్ పోస్టులు, 114 మహిళలకు రిజర్వ్ చేశారు. 335 పోస్టుల్లో ఎస్సీల్లో జనరల్ 33, మహిళలు 17 పోస్టులు, ఎస్టీల్లో జనరల్ 14, మహిళలు 7 పోస్టులు, బీసీ (ఏ)లో జనరల్ -17, మహిళలు-7, బీసీ (బి)ల్లో జనరల్ 20, మహిళలు 13 పోస్టులు, బీసీ (సి)ల్లో జనరల్ 3, మహిళలు -01, బీసీ (డి)ల్లో జనరల్ -15, మహిళలు-7, బీసీ(ఇ)ల్లో జనరల్ -9, మహిళలు-4, దివ్యాంగుల్లో జనరల్ 7, మహిళలు -4, ఎక్స్ సర్వీస్‌మెన్ జనరల్ -7, స్పోర్ట్స్ కోటాలో -6 పోస్టులు, అన్‌రిజర్వ్‌డ్ కోటాలో జనరల్-90, మహిళలకు 54 పోస్టులు ఉన్నాయి.

నిర్మల్ జిల్లాలో 322 పోస్టులకుగాను 211 జనరల్ పోస్టులు, 111 మహిళలకు రిజర్వ్ చేశారు. 322 పోస్టుల్లో ఎస్సీల్లో జనరల్ 32, మహిళలు 17 పోస్టులు, ఎస్టీల్లో జనరల్ 12, మహిళలు 07 పోస్టులు, బీసీ (ఏ)లో జనరల్ -16, మహిళలు-7, బీసీ (బి)ల్లో జనరల్ 18, మహిళలు 13 పోస్టులు, బీసీ (సి)ల్లో జనరల్ 3, మహిళలు -01, బీసీ (డి)ల్లో జనరల్ -15, మహిళలు-7, బీసీ(ఇ)ల్లో జనరల్ -9, మహిళలు-4, దివ్యాంగుల్లో జనరల్ 6, మహిళలు -4, ఎక్స్ సర్వీస్‌మెన్ జనరల్ -7, స్పోర్ట్స్ కోటాలో -6 పోస్టులు, అన్‌రిజర్వ్‌డ్ కోటాలో జనరల్-87, మహిళలకు 51 పోస్టులు ఉన్నాయి.

ఆసిఫాబాద్ జిల్లాలో 235 పోస్టులకుగాను 155 జనరల్ పోస్టులు, 80 పోస్టులు మహిళలకు రిజర్వ్ చేశారు. 235 పోస్టుల్లో ఎస్సీల్లో జనరల్ 23, మహిళలు 12 పోస్టులు, ఎస్టీల్లో జనరల్ 10, మహిళలు 5 పోస్టులు, బీసీ (ఏ)లో జనరల్ -12, మహిళలు-5, బీసీ (బి)ల్లో జనరల్ 14, మహిళలు 09 పోస్టులు, బీసీ (సి)ల్లో జనరల్ 2, మహిళలు -01, బీసీ (డి)ల్లో జనరల్ -10, మహిళలు-5, బీసీ(ఇ)ల్లో జనరల్ -6, మహిళలు-3, దివ్యాంగుల్లో జనరల్ 6, మహిళలు -2, ఎక్స్ సర్వీస్‌మెన్ జనరల్ -5, స్పోర్ట్స్ కోటాలో -4 పోస్టులు, అన్‌రిజర్వ్‌డ్ కోటాలో జనరల్-63, మహిళలకు 38 పోస్టులు ఉన్నాయి.

మంచిర్యాల జిల్లాలో 232 పోస్టులకుగాను 153 జనరల్ పోస్టులు, 79 మహిళలకు రిజర్వ్ చేశారు. 232పోస్టుల్లో ఎస్సీల్లో జనరల్ 23, మహిళలు 12 పోస్టులు, ఎస్టీల్లో జనరల్ 09, మహిళలు 5 పోస్టులు, బీసీ (ఏ)లో జనరల్ -12, మహిళలు-5, బీసీ (బి)ల్లో జనరల్ 13, మహిళలు 9 పోస్టులు, బీసీ (సి)ల్లో జనరల్ 2, మహిళలు -01, బీసీ (డి)ల్లో జనరల్ -10, మహిళలు-05, బీసీ(ఇ)ల్లో జనరల్ -06, మహిళలు-03, దివ్యాంగుల్లో జనరల్ 6, మహిళలు -2, ఎక్స్ సర్వీస్‌మెన్ జనరల్ -5, స్పోర్ట్స్ కోటాలో -4 పోస్టులు, అన్‌రిజర్వ్‌డ్ కోటాలో జనరల్-63, మహిళలకు 37 పోస్టులు ఉన్నాయి.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...