పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి


Wed,September 5, 2018 01:43 AM

కుంటాల : రోజు రోజుకూ పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని కల్లూర్ గ్రామంలో హరితహారంలో భాగంగా స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలను నాటేందుకు చాలెంజ్‌గా తీసుకొని, సంరక్షించాలని సూచించారు. అనంతరం కల్లూర్-కుంటాల రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన మొక్కలు, ట్రీ గార్డులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గాయత్రి, ఈవోపీఆర్డీ ప్రసా ద్, నాయకులు కొత్తపల్లి బుచ్చన్న, జుట్టు మహేందర్, చంద్రకాంత్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

నాటిన మొక్కలను సంరక్షించాలి
లోకేశ్వరం : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని మన్మథ్, పొట్‌పెల్లి గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలతో పాటు శ్మశాన వాటికలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకునేలా చూడాల్సిన బాధ్యత గ్రామ ప్రత్యేకాధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శులకు ఉందన్నారు. ప్రతి ఉద్యోగి నిబద్ధతతో పని చేయాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు అశోక్, సురేష్‌రావ్, రాఘవేందర్, మాజీ సర్పంచి వజ్ర శంకర్‌గౌడ్ ఉన్నారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...