నెలాఖరుకల్లా హరితహారం పూర్తి చేయాలి


Wed,September 5, 2018 01:43 AM

నిర్మల్ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నాల్గో విడత హరితహారం కార్యక్రమం అన్ని జిల్లాల్లో నెలాఖరుకల్లా పూర్తి లక్ష్యాన్ని చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్టు అధికారులతో హరితహారం, వీఆర్‌వో పరీక్షల నిర్వహణ, పాడి గేదెల పంపిణీ తదితర పథకాలపై సమీక్షించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తిగా మొక్కలను నాటాలని వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. నాల్గో విడత హరితహారంలో వంద కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిన లక్ష్యాన్ని గుర్తు చేశారు. నిర్మల్‌లో జిల్లాలో అన్నిశాఖల అధికారులు, మండల స్థాయి అధికారులతో సమన్వయంతో హరితహార లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామపంచాయతీలో గ్రామానికొక నర్సరీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం మండలస్థాయిలో ఎంపీడీవోలు గ్రామసభలు నిర్వహించి నర్సరీల స్థలాలు గుర్తించాలని ఆదేశించారు.

కొత్త గ్రామపంచాయతీలో నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 16న నిర్వహించే వీఆర్వో పరీక్ష నిర్వహణకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి వాణిప్రసాద్ మాట్లాడుతూ పరీక్షల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణవ్యాప్తంగా 11లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని, ఆయా పరీక్షా కేంద్రాలను గుర్తించి భద్రత ఏర్పాట్లను చేయాలని కోరారు. సబ్సిడీ గేదెల పథకాన్ని పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 21 నాటికల్లా లబ్ధిదారులకు పాడి గేదెల పంపిణీ పూర్తి చేయాలని, పశు సంవర్ధకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి పథకాల పనితీరుపై కలెక్టర్ ప్రశాంతి వివరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు వెంకటేశ్వర్లు, దామోదర్‌రెడ్డి, రామేశ్‌రాథోడ్, గజ్జారాం, ప్రణీత తదితరులు పాల్గొన్నారు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...