సదర్మాట్ ఆయకట్టుకు మళ్లీ ప్రాణం


Thu,November 23, 2017 02:39 AM

-పొన్కల్ వద్ద గోదావరిపై బ్యారేజీకి శ్రీకారం
-ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు
-రూ.315.58కోట్లతోశరవేగంగా పనులు
-అదనపు ఆయకట్టుకు సాగునీరు
-నిర్మల్, కరీంనగర్ జిల్లాలకు సాగు,తాగునీటి వసతి
-అక్టోబర్ 2018 నాటికి పూర్తి చేసేందుకు చర్యలు

నిర్మల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : దశాబ్దాల క్రితం నిజాం కాలంలో నిర్మించిన ఆనకట్ట సదర్మాట్.. అలాంటి సదర్మాట్ ఆయకట్టుకు మళ్లీ ప్రాణం పోసి రైతాంగాన్ని ఆదుకునేందుకు గోదావరి నదిపై మరో బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. సమైక్య పాలనలో కాగితాల్లో పరిపాలన పరమైన అనుమతులకే పరిమితమవ్వగా.. మామడ మండలం పొన్కల్ వద్ద సదర్‌మాట్ బ్యారేజీ నిర్మాణం స్వరాష్ట్రంలో కార్యరూపం దాలుస్తోంది. రూ.516.23 కోట్లతో పరిపాలన అనుమతులు ఇవ్వగా... పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేయనున్నారు. సదర్‌మాట్ ఆయకట్టు 6848 ఎకరాలతో పాటు కొత్తగా 5618 ఎకరాలు మొత్తం ఖానాపూర్ నియోజకవర్గంలో 12466 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాలకు తాగునీరు అందనుంది.

1891-92 సంవత్సరంలో నిజాం కాలంలో ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మేడంపల్లి సమీపంలో గోదావరి నదిపై ఎడమవైపున సదర్‌మాట్ ఆనకట్ట నిర్మించారు. ఈ ఆనకట్ట కింద 6848ఎకరాల ఆయకట్టు ఉండేది. గోదావరి నది ప్రవాహం మళ్లించడం ద్వారా ఆనకట్ట నుంచి ఆయకట్టుకు నీటి సరఫరా చేసేందుకు వీలుండేది. గోదావరిలో నీటి ప్రవాహం లేని సమయంలో ఆయకట్టు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును 1962లో నిర్మించాక గోదావరి నది ప్రవాహం తగ్గిపోయింది. నీటి లభ్యత లేకపోవడంతో ఆయకట్టు రైతులకు రెండు పంటలు పం డించే పరిస్థితి లేకుండాపోయింది.

కొన్నిసార్లు ఖ రీఫ్ సీజన్‌లో కూడా తీవ్ర నీటి కొరతను ఎదుర్కొవలసి వచ్చింది. సదర్‌మాట్ ఆనకట్ట వద్ద నీటి ని ల్వ లేకపోవడంతో సదర్‌మాట్ బ్యారేజీ నిర్మా ణం చేపట్టవలసి వస్తోంది. దిగువ పరివాహాక ప్రాంత ప్రజలు, రైతుల హక్కులను పరిరక్షించాల నే ఉద్ధేశ్యంతో ఈ బ్యారేజీని నిర్మించాలని గత ప్ర భుత్వం నిర్ణయించింది. సదర్‌మాట్ ఆనకట్ట ఎగువన మామడ మండలం పొన్కల్, నల్దుర్తి మధ్యలో బ్యారేజీ నిర్మాణానికి నిర్ణయించారు.

శరవేగంగా సాగుతున్న సదర్మాట్ బ్యారేజీ పనులు


గత ప్రభుత్వ హయాంలోనే మొదట ఈ బ్యారేజీ నిర్మాణం కోసం రూ.305.14 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చినప్పటికి పనులు మాత్రం ప్రారంభం కాలేదు. తర్వాత పెరిగిన అంచనాల నేపథ్యంలో రూ.486.273కోట్లతో సవరించిన పరిపాలన అనుమతులు ఇచ్చారు. రెండు సార్లు పరిపాలన అనుమతులు ఇచ్చినప్పటికీ.. నిర్మాణ పనులు మాత్రం ప్రారంభించకుండా వదిలేశారు. స్వరాష్ట్రంలో మళ్లీ ఈ బ్యారేజీ నిర్మాణానికి మోక్షం కలిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక జీవో ఆర్‌టి నెం. 178, తేదీ 18.02.2016న రూ. 516.233 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చారు. సీఈఆర్ నెం.02/2016-17, తేదీ 03.05.2016 రూ.427.25కోట్లకు సాంకేతిక ఆమోదం ఇచ్చారు. రూ.315.58కోట్లకు రాఘవ-ఎస్‌ఈడబ్ల్యూ-స్వప్న(జేవీ) ఏజెన్సీతో ఒప్పం దం చేసుకున్నారు. ప్రస్తుతం బ్యారేజీ నిర్మాణ ప నులు శరవేగంగా సాగుతున్నాయి. రెండేళ్ల గడువు తో కాంట్రాక్టు అప్పగించగా.. డిజైన్లు, అగ్రిమెం ట్లు, శంకుస్థాపన పూర్తయి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 2018అక్టోబర్ వరకు పనులు పూర్తి అప్పగించాల్సి ఉండగా.. జూన్, 2018నాటికి సీసీ పనులు, 2018 అక్టోబర్ నాటికి పూర్తి చేయటమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 23శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 55గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. పునాది తవ్వకాలు పూర్తయ్యాయి. 25 స్తంభాలకు పునాదులు పూర్తవ్వగా... ప్రస్తుతం 5గేట్లకు కాంక్రీటు వేశారు. 20గేట్లకు 50శాతం కాంక్రీటు పనులు.. 30గేట్లకు ఫౌండేషన్ దశలో పనులున్నాయి.

ముంపు భూములకు పరిహారం చెల్లింపు


ఈ బ్యారేజీ నిర్మాణంతో నిర్మల్, జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో భూమి ముంపునకు గురవుతోంది. మొత్తం 1102ఎకరాల భూమి ముంపునకు గురవుతుండగా నిర్మల్ జిల్లాలోని 4 గ్రా మాల్లో 751ఎకరాలు, జగిత్యాల జిల్లాలోని మూ డు గ్రామాల్లో 351 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్‌లో 448.34ఎకరాలు, ఆదర్శనగర్‌లో 48 ఎకరాలు, న్యూటెంబరేణి 76.12ఎకరాలు, కమల్‌కోటలో 148.31ఎకరాలు, జగిత్యాల జిల్లాలోని మూలరామపురం 282.17 ఎకరాలు, ఎర్దండి 25.17ఎకరాలు, కోమటి కొండాపూర్ 42.37 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని మూడు గ్రామాలకు సంబంధించి రూ.31.42కోట్లు ఇప్పటికే చెల్లించారు. ఇక నిర్మల్ జిల్లాలోని ఆరు గ్రామాలకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ బుధవారం జారీ చేశా రు. వీరికి కూడా సాధ్యమైనంత వేగంగా పరిహా రం చెల్లించేందుకు చర్యలు చేపట్టారు.

సదర్మాట్ బ్యారేజీతో బహుళ లాభాలు...


ప్రస్తుత సదర్‌మాట్ బ్యారేజీ గోదావరి ప్రవాహం ఉన్నప్పుడు మాత్రమే ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది. ఇక్కడ నీరు నిల్వ చేసే పరిస్థితి లే దు. అందుకే ఈ ఆయకట్టుకు ప్రాణం పోసేందుకుగాను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పొన్కల్ వద్ద 1.58 టీఎంసీల సామర్థ్యంతో ఈ బ్యారేజీ నిర్మిస్తున్నారు. ఈ బ్యారేజీ నిర్మాణంతో సదర్‌మాట్ ఆనకట్ట కింద ఉన్న 6848 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు, ఖానాపూర్ నియోజకవర్గంలోని 26 గ్రామాల్లో 5618ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందనుంది. నీరు పుష్కలంగా ఉన్న సమయంలో 15వేల ఎకరాలకు పైగా సాగునీరు అందనుంది. ఈ కాలువ ద్వారా వెళ్లే నీరు చివరికి కడెం రిజర్వాయర్‌కు చేరనుంది. కడెం జలాశయంనకు 350 క్యూసెక్కుల నీటిని ఖరీఫ్ సీజన్ ముగింపు సమయంలో సరఫరా చేస్తారు. ఏడాది పొడవున మామడ, ఖానాపూర్ మండలాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తారు. గోదావరి నదికి ఇరువైపులా ఉన్న బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో భూగర్భజలాల నీటి నిల్వ సామర్థ్యం పెరగనుంది. గోదావరి నది సమీపంలో ఉన్న దే వాలయాలకు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రోడ్డు మార్గం ఏర్పడుతోంది. జగిత్యాల జిల్లాలోని గంగనాల ప్రాజెక్టు కింద ఉన్న 4వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించనున్నారు. వేములకుర్తి ప్రాజెక్టుకు నిరంతరం తాగునీటి సరఫరా జరగనుంది. జగిత్యాల జిల్లాలోని యమపురం, మొగల్‌పేట, మల్లాపూర్ గ్రా మాలకు తాగునీటిని చెరువుల ద్వారా అందిస్తారు.

మూడు, నాలుగు గంటల్లో సదర్‌మాట్‌కు నీరు...


ప్రస్తుతం నిర్మించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సదర్‌మాట్‌కు ఎగువన 7.2 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నారు. సదర్‌మాట్‌కు అవసరమైనప్పుడు ఇక్కడి నుంచి నీరు విడుదల చేస్తారు. సదర్‌మాట్‌కు చేరిన నీరు పాత కాల్వ ద్వారా పాత ఆయకట్టుతో పాటు కొత్తగా స్థిరీకరించే ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది. సరస్వతి, లక్ష్మి, కాకతీయ కాలువలకు వదిలే నీరు రిజనరేటర్ అయి ఇందులోకి చేరడంతో రైతులకు యాసంగిలో నీరు ఇవ్వవచ్చు. ఈనెల 10న సరస్వతి కాలువకు కాల్వ నుంచి వడ్యాల్ వద్ద 500 క్యూసెక్కుల నీరును వాగులోకి వదిలారు. ఈ వాగులో నుంచి 12 కిలోమీటర్ల మేర నీరు ప్రవహించి గోదావరిలో కలిసింది. గోదావరి నుంచి 20 కిలోమీటర్లు ప్రవహించిన నీరు సదర్మాట్ చేరింది. సదర్‌మాట్‌కు 375 క్యూసెక్కుల నీరు 2 నుంచి 3 రోజుల్లో చేరడం గమనార్హం. ఈ లెక్కన కొత్త బ్యారేజీ నుంచి పాత బ్యారేజీ నీరు చేరడం చాలా సుల భం. 7.2 కిలోమీటర్ల దూరంలోని సదర్‌మాట్‌కు 3 నుంచి 4 గంటల్లో చేరుతుంది. నీటి ప్రవాహం సరిగా వెళ్లేలా గైడ్‌వాల్స్‌ను నిర్మిస్తున్నారు. కొత్త బ్యారేజీకి ఎగువన 15 కిలోమీటర్ల వరకు నీరు నిల్వడంతో ఎత్తిపోతల ద్వారా ఎగువ ప్రాంతంలోని ఆయకట్టుకు నీరు ఇవ్వవచ్చు. పరిసర ప్రాం తాల్లో భూగర్భజలాలు పెరుగుతాయి. సదర్‌మా ట్ కొత్త బ్యారేజీ నిర్మాణంపై ఈనెల 11న ఖానాపూర్‌లో ఎస్సారెస్పీ అధికారులు రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రైతులకు ఉన్న అనుమానాలు నివృత్తి చేశారు.

129
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...