పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Sun,December 15, 2019 04:09 AM

-8 మంది పేకాటరాయుళ్ల అరెస్టు
-కేసు నమోదు
-రూ.75 వేల నగదు, కారు, 10 బైక్‌లు, 8 సెల్‌ఫోన్‌లు స్వాధీనం
ఖిల్లాఘణపురం : గుట్టుచప్పుడుగా పేకాట ఆడుతున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో 8 మందితో పాటు రూ.75 వేల నగదు, ఒక కారు, 10 బైక్‌లు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మండలంలోని కర్నెతండా సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై రామస్వామి తెలిపిన వివరాల మేరకు.. గత కొంతకాలం నుంచి కర్నెతండా సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. అందులో భాగంగానే శనివారం తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. కొంత మంది పేకాటరాయుళ్లు పారిపోయారన్నారు. ఎనిమిది మంది మాత్రం పట్టుబడ్డారని చెప్పారు. వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. వీరితో పాటు రూ.75 వేల నగదు, ఒక కారు, 10 బైక్‌లు, 8 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ వారిలో మహబూబ్‌నగర్‌, వనపర్తి, జడ్చర్ల, ఆత్మకూర్‌కు చెందిన కొంత మంది ఉన్నారని తెలిపారు. వీరిని వనపర్తి కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్సై తెలిపారు. ఎక్కడైనా, ఎవ్వరైనా పేకాట ఆడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్సైతో పాటు పోలీసులు ఉన్నారు.
బాలకిష్టాపూర్‌లో పేకాటరాయుళ్ల అరెస్ట్‌
ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : మండలంలోని బాలకిష్టాపూర్‌లో పేకటరాయుళ్లను పోసులు అరెస్ట్‌ చేశారు. పక్కా సమాచారంతో వార్డ్‌ మెంబర్‌ చిరంజీవి స్వగృహంపై దాడులు నిర్వహించి నలుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై ముత్తయ్య తెలిపారు. అరస్టైన వారిలో వార్డు మెంబర్‌ చిరంజీవి, మన్నెంబాబు, నరసింహ, యాసీన్‌ ఉన్నారు. వీరి నుంచి రూ.వెయ్యి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పేకాట రాయుళ్లను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles