ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన

Sun,December 15, 2019 04:09 AM

మరికల్‌ : ఈ ఏడాది కస్తూర్భా గాంధీ గురుకుల పాఠశాలలో నూతనంగా ప్రవేశ పెట్టిన ఏఈడీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు తోటి విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలలోని ఘట్టాలను ప్రత్యేక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రతి శనివారం ఏఈడీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గురుకుల ప్రత్యేక అధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. అందులో భాగంగా 6 నుంచి 9వ తరగతి వరకు సోషల్‌ పాఠ్య పుస్తకంలోని పాఠ్యాంశాల్లోని అంశాలను విద్యార్థులు వారివారి తరగతి విద్యార్థుల ముందు ప్రదర్శనలు చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం ద్వారా విద్యార్థులకు పాఠంలోని యధార్థ ఘటనలను వారికి చూపించడం జరుగుతున్నట్లుగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యశోధ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కేజీబీవీలో ఏఈడీ కార్యక్రమం
నర్వ : మండల కేంద్రంలోని కేజీబీవీలో శనివారం అకాడమిక్‌ ఎన్‌డ్రిచ్‌డ్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు తమ తోటి విద్యార్థినులకు సాంఘిక శాస్త్రంలోని పలు పాఠ్యాంశాలను బోధించారు. వర్షపాతం, శీతోష్ణస్థితి, దేశంలో రాజుల యొక్క పాలన, భారత రాజ్యంగం, స్వాంత్రత్యోద్యమ నాయకుల జీవిత చరిత్రలు, భారత దేశంలో పేదరిక నిర్మూలన తదితర అంశాలపై పాఠాలను బోధించారు. అలాగే చెట్ల సంరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, దిశ ఉదాంతం, మహిళల రక్షణ, రవాణా మార్గాలు, పార్లమెంట్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన బిల్లులు తదితర అంశాలపై విద్యార్థినులు ప్రదరివంచారు. కేజీబీవీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

20
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles