రేషన్‌ దుకాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆకస్మిక దాడులు

Sat,December 14, 2019 12:22 AM

- రెండు రేషన్‌ దుకాణాల సీజ్‌
జడ్చర్ల : జడ్చర్లలో సివిల్‌ సైప్లె, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శుక్రవారం రేషన్‌ దుకాణాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా రెండు రేషన్‌ దుకాణాల సీజ్‌ చేశారు. శుక్రవారం జడ్చర్లలోని 3వ నంబర్‌ రేషన్‌ దుకాణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు డీటీలు బాల ప్రసాద్‌, రహమాన్‌ల ఆధ్వర్యంలో దాడులు నిర్వహిం చారు. ఈ సందర్భంగా జడ్చర్ల మున్సిపాలిటీలోని 3వ నంబర్‌ రేషన్‌ దుకాణంలో అక్కడి ఈ-పాస్‌ మిషన్‌కు అక్కడ స్టాక్‌కు 16 క్వింటాళ్ల వ్యత్యాసం ఉండటంతో దుకాణాన్ని సీజ్‌ చేసి 6-ఎ కేసు నమోదు చేనిసట్లు తెలిపారు. ఆ షాపును పక్క షాపు డీలర్‌కు అప్పజెప్పారు. అదే విధంగా జడ్చర్లలోని 20వ నంబర్‌ రేషన్‌ దుకాణంలో తనిఖీలు చేయగా అక్కడా ఈ-పాస్‌ మిషన్‌కు అక్కడి స్టాక్‌కు 7.17 క్వింటాళ్ల తేడా ఉండటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దుకాణాన్ని సీజ్‌ చేసి 6-ఎ కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీలు బాలప్రసాద్‌, రహమాన్‌లు తెలిపారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles