పెదింటి ఆడపడుచులకు పెద్దన్న కేసీఆర్‌

Sat,December 14, 2019 12:22 AM

-జెడ్పీ చైర్‌ పర్సన్‌ కే వనజ, పేట, మక్తల్‌ ఎమ్మెల్యేలు ఎస్‌ రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మరికల్‌ : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశ పెట్టిన ఘ నత కేవలం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని జెడ్పీ చైర్‌ పర్స న్‌ కే వనజ, నారాయణపేట, మక్తల్‌ ఎమ్మెల్యేలు ఎస్‌ రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డిలు అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలోని తిరుమల ఫంక్షన్‌హాల్‌లో మండలానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పం పిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభు త్వం ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తుందని అన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు అందచేస్తున్నామని తెలిపారు. పుట్టిన బిడ్డకు 12 వేల రూపాయలతో పాటు కేసీఆర్‌ కిట్‌ అందించి ఆదుకుంటున్నదని వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ గౌని సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళ, వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, సర్పంచ్‌ కస్పే గోవర్ధన్‌ పాల్గొన్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles