అరుణమ్మా దొంగదీక్ష మానుకో

Sat,December 14, 2019 12:22 AM

-ఆమె ఇంట్లోనే మద్యం మ్యూజియం
-ఉమ్మడి జిల్లాలో 25 మద్యం షాపులు వాళ్లవే
-భర్తది మద్యం వ్యాపాం.. నిషేధం కోసం భార్య దీక్ష
-మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మరికల్‌ : రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేస్తూన్న మాజీ మంత్రి డీకే అరుణ ఇంట్లో మద్యం మ్యూజియం ఉందని, అరుణమ్మ భర్త మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డికి ఉమ్మడి జిల్లాలో 25 మద్యం షాపులు ఉన్నాయని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలోని తిరుమల ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యాక్రమం లో మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ గద్వాల ఎమ్మెల్యే మద్యనిషేధం కోరుతూ ధర్నా నిర్వహించడం సిగ్గుచేటుగా ఉందన్నారు. మీ ఇంట్లో దేశంలో ఎక్కడాలేని బ్రాండ్‌ల మం దులు మ్యూజియంగా ఏర్పాటు చేసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ముందు ఇంట్లో ఉన్న మద్యం మ్యూ జియం తీసివేశాక రాష్ట్రం గురించి ఆలోచించాలని, పార్టీ పదవుల కోసం దొంగ దీక్షలు చేయడం మానుకోవాలని ఆ యన హితవు పలికారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ కే వనజ, పేట ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ గౌని సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళ, వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, గ్రామ సర్పంచ్‌ కస్పే గోవర్ధన్‌ పాల్గొన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles