దైవచింతనతో ప్రతి వ్యక్తికీ మానసిక ప్రశాంతత

Fri,December 13, 2019 12:56 AM

కోస్గి : ప్రతి వ్యక్తి జీవితంలో దైవ చింతన అత్యంత ప్రధానమైన అంశంగా చేర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ కవి ప్రొద్దుటూరి ఎల్లారెడ్డి అన్నారు. గురువారం కోస్గి పట్టణంలోని సాయిబాబ ఆలయంలో ఏర్పాటు చేసిన దత్త జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనస్సు ప్రశాంతతో మన శరీరాన్ని అదుపులో ఉంచు కోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా దైవచింతనే సరైన మార్గమన్నారు. అలవాటుతో పాటు ఆలోచనలో సహితం సమూలంగా మార్పులకు అవకాశం ఏర్పడి నూతన భావాలతో భగవంతుడి బోధనలకు దగ్గరై చక్కటి జీవితాన్ని జీవించేందుకు దోహదపడుతుందన్నారు. దత్త జయంతి ఉత్సవాలను పురస్క రించుకొని ఆలయంలో అన్నదాన కార్యక్రమంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ నాయకులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

ఎమ్యెల్యేను సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులు
ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి పట్టణంలోని సాయిబాబ ఆల యంలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో భగవంతుని ఆలోచనలను కలిగి నడుచుకోవాలని సూచించారు. ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న దత్త జయంతి వేడుకలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles