వృత్తి పట్ల నిబద్ధత, విధేయత కలిగి ఉండాలి

Fri,December 13, 2019 12:55 AM

-పోలీస్‌స్టేసన్లలో శ్రమదానానికి శ్రీకారం చుట్టిన ఎస్పీ డాక్టర్‌ చేతన
నారాయణపేట, నమస్తేతెలంగాణ : పోలీసులు తమ వృత్తి పట్ల నిబద్ధత, విధేయత కలిగి ఉండాలని నారాయణపేట జిల్లా పోలీసు ఎస్పీ డాక్టర్‌ చేతన అన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో గురువారం శ్రమదాన కార్యక్రమాలను చేపట్టారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్ర పరిచారు. ఈ సందర్భంగా నారాయణపేటలోని ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ డాక్టర్‌ చేతన మాట్లాడుతూ ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం చేసే ప్రతి పనిలో అలసట అనేది ఉండదన్నారు. మనం మంచి వాతావరణంలో ఉండడం వల్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల పట్ల సత్ప్రవర్తన కలిగి వారి సమస్యలను సావధానంగా పరిష్కరించగలుగుతామన్నారు. ప్రజలు, సహచరులు, అధికారులతో మర్యాద పూర్వకంగా ఉంటూ వృత్తిపట్ల అంకిత భావం కలిగి క్రమ శిక్షణ, సమయపాలన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ స్టేషన్‌లోని సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

21
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles