ఒత్తిడి లేకుండా ప్రత్యేక ప్రణాళికతో చదవాలి

Fri,December 13, 2019 12:55 AM

నారాయణపేట టౌన్‌ : విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రత్యేక ప్రణాళికతో చదవాలని ఉమ్మడి జిల్లా మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సమన్వయ కర్త సలీం విద్యార్థులకు సూచించారు. గురువారం పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శిం చారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు భోదించే ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పదవ తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించేలా డిసెంబర్‌ 15 నుంచి క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు ప్రణాళికా బద్దంగా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్‌ బాలనర్సింహా స్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles