వెనుకబడిన విద్యార్ధుల పట్ల శ్రద్ధ వహించాలి

Fri,December 13, 2019 12:55 AM

-డీఈవో రవీందర్‌
మాగనూర్‌ : చదువులో వెనుకబడిన విద్యార్దుల పట్ల శ్రద్ధ వహించి వారి స్ధాయికి అనుగుణంగా బోధించాలని డీఈవో రవీందర్‌ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్యం వహించకుండా విద్యార్థులకు బోధించాలని పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలకు విద్యార్ధులను సన్నద్ధం చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించుకొని బోధన కొనసాగిం చాలన్నారు. ఉపాధ్యాయులు కొంత అదనపు సమయం కేటాయించి పదిలో మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం గణేశ్‌సింగ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

24
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles