ఉత్కంఠ వీడేనా..!

Thu,December 12, 2019 01:51 AM

-అందరిదృష్టి హైకోర్టు నిర్ణయం పైనే..
- దిశ ఎన్‌కౌంటర్‌ కేసులో శవాల అప్పగింతపై నేడు స్పష్టత వచ్చే అవకాశం

నారాయణపేట ప్రతినిధి నమస్తే తెలంగాణ : దిశ హత్యాచార ఘటనలో ప్రధాన నిందితులు ఎన్‌కౌంటర్‌ అయిన నలుగురు మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించే విషయంలో గురువారం నాటికైన ఉత్కంఠ వీడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన తరువాత, హైకోర్టు, సుప్రీం కోర్టులలో పలువును కేసులు వేయగా, మరికొందరు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మృతదేహాల అప్పగింతలో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. మృతుల కుటుంబసభ్యులతో పాటు ఆయా గ్రా మాల్లోను ఉత్కంఠ నెలకొంది. దిశ హత్యకేసులో అరెస్ట్‌ అ యిన నాటి నుంచి ఇప్పటి వరకు నిందితులుగా ఉన్నప్పుడుగాని, ఎన్‌కౌంటర్‌ అయిన తరువాత గాని కుటుంబ సభ్యులకు వారిని చూసే అవకాశం ఇవ్వలేదు. అంత్యక్రియల సందర్భం గా నైన కడిసారిగా చూసుకోవాలని ఆశ పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం నాటికి మృత దేహాలను వారివారి కుటంబ సభ్యులకు అప్పగించే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

నేటికీ ఏడు రోజులు
దిశ హత్యాచార ఘటనలో మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామానికి చెం దిన జొల్లు శివ, జొల్లు నవీన్‌, చింతకుంట చెన్న కేశవులు, జక్లేర్‌కు చెంది న మహ్మద్‌ పాషా ఎన్‌కౌంటర్‌లో చనిపోయి ఏడు రోజులవుతోంది. గతనెల 27న దిశను హత్య చేసిన అనంతరం 29న తెల్లవారు జామున పోలీసులకు చిక్కిన నిందితుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. నెల 6వ తేదీ తెల్లవారు జామున కేసు రీ కన్‌స్ట్రక్షన్‌ కోసం నిందితులను హత్యాచార ఘటన జరిగిన చటాన్‌పల్లి వద్దకు తీసుకెళ్లారు. వివరాలు సేకరించే క్రమంలో నిందితులు తప్పించుకునే ప్రయ త్నం చేయడం, పోలీసులపై తిరుగబడడంతో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. అదే రోజురాత్రి పోస్ట్‌ మార్గం పూర్తి చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేస్తారని భావించి అందుకు అనుగుణంగా అంత్యక్రియలకోసం ఏ ర్పాట్లు చేశారు.

హైకోర్టు ఆదేశాలతో నిలుపుదల
ఎన్‌కౌంటర్‌కు సంబంధించి జాతీయ మానవహక్కుల కమిషన్‌ను పలువురు ఆశ్రయించారు. దీంతో ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం సభ్యులు నిందితుల మృతదేహాలను, ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దీంతో మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. ఈ నెల 8వ తేదీ నాటికి వివరాలను సేకరించి మృత దేహాలను బంధువులకు అప్పగిస్తారని భావించారు, కాని మరిన్ని వివరాలను సేకరించాల్సిన అవసరం ఉండటంతో మృత దేహాలను మహబూబ్‌నగర్‌ నుంచి గాంధీకి తరలించి భద్రపరిచారు.

నేడు హైకోర్టు తీర్పు
ఇప్పటికే ఎన్‌కౌంటర్‌ జరిగిన ఏడురోజులైంది. మృతదేహాలను అంత్యక్రియల కోసం ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు గురువారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరిన్ని వివరాలను సేకరించాల్సి వచ్చినా, సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటే మినహా మృతదేహాలను శుక్రవారం లోపు అంత్యక్రియలకు అప్పగించే అవకాశాలున్నాయని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles